BigTV English

MLC Mahender Reddy: కేటీఆర్ తెలుసుకో..నేనేం చెరువు ఆక్రమించలేదు.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫైర్

MLC Mahender Reddy: కేటీఆర్ తెలుసుకో..నేనేం చెరువు ఆక్రమించలేదు.. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫైర్

MLC Mahender Reddy comments on Himayat Sagar Lake: ప్రభుత్వ నిబంధనల మేరకే ఇల్లు కట్టుకున్నానని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. హిమాయత్ సాగర్‌లో నిర్మించిన గెస్ట్ హౌస్‌పై బీఆర్ఎస్ నాయకులు అక్రమంగా నిర్మించుకున్నారని చేస్తున్న ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. అయితే చెరువులను ఆక్రమించి చాలామంది నిర్మాణాలు చేపట్టారని, హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మంచిదేనని సమర్థించారు.


ప్రభుత్వ నిబంధనల ప్రకారమే హమాయత్ సాగర్‌లో ఓ ఇల్లు నిర్మించుకున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. నేను ఎలాంటి చెరువును ఆక్రమించలేదని, కొంతమంది చెరువును కబ్జా చేసి ఇల్లు నిర్మించారని అంటున్నారన్నారు. కొంతమంది కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

ఒకవేళ నిబంధనల ప్రకారం లేదని తేలితే..నేనే నా భవనాన్ని హైడ్రా సహాయంతో కూల్చివేసేందుకు సహకరిస్తానని మహేందర్ రెడ్డి చెప్పారు. ఎప్‌టీఎల్ పరిధిలో ఉందని నిరూపిస్తే నా గెస్ట్ గౌస్ కూల్చివేసేందుకు సిద్ధమని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి వివరాలు తెలియకుండా మాట్లాడారని భావిస్తున్నట్లు ఎమ్మెల్సీ చెప్పుకొచ్చారు.


111 జీఓ పరిధిలో చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇళ్లు నిర్మించుకున్నారన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే నిర్మించుకున్నామని మహేందర్ రెడ్డి చెప్పారు. నా గెస్ట్ హౌస్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటే కూల్చేయమని చెబుతున్నాన్నారు. పట్టాభూమిలోనే నా గెస్ట్ హౌస్ ఉందని, అక్కడ దగ్గరలో చాలా ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయన్నారు.

Also Read: నన్ను ఏమైనా చేసుకోండి.. నా కాలేజీ జోలికి రావొద్దు : అక్బరుద్దీన్ ఒవైసీ

నా గెస్ట్ హౌస్ దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడమని, తాను ఎక్కడా కూడా నిబంధనలు అతిక్రమించలేదని పట్నం చెప్పారు. నిత్యం ఏదో ఒక పత్రికల్లో తన గెస్ట్ హౌస్ ప్రస్తావన వస్తుండడంతోనే క్లారిటీ ఇచ్చేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశాన్నారు.

ఇదిలా ఉండగా, హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. హైదరాబాద్ లో ఉన్న చెరువులు, పార్కు స్థలాలను ఆక్రమించి అక్రమంగా కట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తుంది. అయితే ఇప్పటికే 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చినట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదిక పంపిన సంగతి తెలిసిందే.

చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టం, బఫర్ జోన్ లో నిర్మాణాల కూల్చివేతలపై నివేదిక విడుదల చేసింది. ఇందులో హీరో నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, మంథని నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన సునీల్ రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది.

అదే విధంగా బంజారాహిల్స్ లోటస్ పాండ్ నుంచి మన్సూరాబాద్, బీఆర్ కే నగర్, గాజులరామారం, అమీర్ పేట, మాదాపూర్, గండిపేటలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. కాగా, 1908 మూసీ వరదల తర్వాత నిజాం హయాంలో వరద నీటిని నిల్వ చేయడంతోపాటు హైదరాబాద్ నగర ప్రాంతానికి తాగునీరు అందించేందుకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు ఏర్పాటు చేశారు. అప్పటినుంచి తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి.

ఈ జలవనరుల పరిరక్షణ కోసం 1996 లో అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం జీఓ 111 తీసుకొచ్చింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువుల చుట్టూ 10కిలో మీటర్ల దూరంలో నిర్మాణాలను నియంత్రించిన సంగతి తెలిసిందే. తర్వాత కేసీఆర్ హయాంలో 111 జీఓ వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు.

ఈ మేరకు హెచ్‌ఎండీఏ లో శంషాబాద్ మండంలోని 47 గ్రామాలు, మొయినాబాద్ లో 20 గ్రామాలు, చేవెళ్లలో 6, శంకరపల్లిలో 3, రాజేంద్ర నగర్ లో 5, షాబాద్ లో 2, కొత్తూరులో ఒక గ్రామాన్ని కలిపి మొత్తం 7 మండలాల్లో 83 గ్రామాల్లో భూముల వినియోగంపై ఆంక్షలు ఉన్నాయి.

Related News

Bhuvanagiri collector: పల్లెకు వెళ్లిన భువనగిరి కలెక్టర్.. సమస్యలన్నీ ఫటాఫట్ పరిష్కారం!

BRS BC Meeting: బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా..? కాంగ్రెస్ ధర్నా సక్సెసే కారణమా?

CM Revanth Reddy: కేంద్రంలో బీజేపీని గద్దె దింపుతాం.. సిఎం రేవంత్ రెడ్డి

Konda Surekha: బీజేపీపై బిగ్ బాంబ్ విసిరిన కొండా సురేఖ.. రాష్ట్రపతినే అవమానించారంటూ కామెంట్స్!

Mahesh Goud: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంది.. బీజేపీకి ఆ సత్తా ఉందా? మహేష్ గౌడ్ ఫైర్!

Raj Gopal Reddy: కేసీఆర్ మౌనంగా ఉంటే ఎలా? లేదంటే రాజీనామా చేయ్..

Big Stories

×