BigTV English

Sanjay Bangar on Rohit Sharma: పర్స్ లో డబ్బులని బట్టే.. రోహిత్ ని కొనగలం: సంజయ్

Sanjay Bangar on Rohit Sharma: పర్స్ లో డబ్బులని బట్టే.. రోహిత్ ని కొనగలం: సంజయ్

Sanjay Bangar reveals Punjab Kings’ strategy to acquire Rohit at IPL 2025 auction: ఐపీఎల్ మెగా వేలంలో హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారిన కెప్టెన్ ఎవరంటే, రోహిత్ శర్మ అనే చెప్పాలి. ఎందుకంటే తను ముంబయిని వీడటం ఖాయంగానే ఉంది. అయితే మరి ఓపెన్ వేలంలోకి వస్తే, ఎవరు కొనగలరనే ప్రశ్న వచ్చింది. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ డైరక్టర్ సంజయ్ బంగర్ వద్ద.. ఒక పాడ్ కాస్టర్ ఉంచాడు.


ఈ నేపథ్యంలో ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపాడు. నిజానికి రోహిత్ శర్మ కానీ మెగా వేలంలోకి వస్తే, చాలామంది కొనలేకపోవచ్చునని అన్నాడు. ఎందుకంటే ప్రతీ ఫ్రాంచైజీ దగ్గరు రూ.100 కోట్లు మాత్రమే డబ్బులుంటాయి. అందులో 40శాతం మాత్రమే ఇద్దరు, ముగ్గురు టాప్ ప్లేయర్లపై వెచ్చించేందుకు అవకాశం ఉంది. అలాగే ఈ సొమ్ములను మూడేళ్లు..మిగల్చాలని తెలిపాడు.

అందువల్ల రోహిత్ శర్మ, ఒకవేల వేలం పాటలో అధికధరకు వెళితే, మరి మిగిలిన ఆటగాళ్ల పరిస్థితేమిటి? అంటున్నారు. అప్పుడు బీ, సీ గ్రేడ్ ఆటగాళ్లను కొనుగోలు చేయాలి. అప్పుడు జట్టు ఇన్ బ్యాలన్స్ అవుతుందని అంటున్నారు. అందుకని సంజయ్ బంగర్ చెప్పిన దాని ప్రకారం ఫ్రాంచైజీ పాకెట్ లో ఉన్న మనీని బట్టి..రోహిత్ శర్మను కొనే అవకాశాలున్నాయి. పంజాబ్ కింగ్స్ అయితే తనని కొనలేదని తేల్చి చెప్పేశారు. ఈ సందర్భంగా మిగిలినవాళ్లు అదేమాటంటే  రోహిత్ పరిస్థితేమిటని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.


Also Read: వినేశ్ కి గోల్డ్ మెడల్.. వచ్చింది!

అయితే, రోహిత్ కి మెగా వేలంలో రూ.50 కోట్లు అని కొందరంటుంటే, మరికొందరు అంత ఉండదు. మహా అయితే రూ. 25 కోట్ల వరకు పెట్టవచ్చునని అంటున్నారు. లేదంటే వెనక నుంచి ఇచ్చినా ఇవ్వవచ్చునని అంటున్నారు.  ఒకవేళ రోహిత్ వేలంలోకి వస్తే రికార్డులు సృష్టించడం ఖాయమని  చెబుతున్నారు.

అందరికన్నా  అత్యధిక ధరను దక్కించుకుంటాడని చెబుతున్నారు. ఇప్పుడు రోహిత్ కి 36 సంవత్సరాలు. ఈ అగ్రిమెంట్ మరో మూడేళ్లు ఉంటుంది. బహుశా రోహిత్ శర్మకు ఇదే ఐపీఎల్ ఆఖరి వేలం కూడా కావచ్చునని అంటున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

Related News

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

Big Stories

×