BigTV English

MLC Mahesh: కేటీఆర్‌కు భారీ కౌంటర్.. పౌరుషముంటే ఫామ్‌హౌస్‌ను కూలగొట్టంటూ..

MLC Mahesh: కేటీఆర్‌కు భారీ కౌంటర్.. పౌరుషముంటే ఫామ్‌హౌస్‌ను కూలగొట్టంటూ..

MLC Mahesh Kumar Goud Comments on KTR: కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన గాంధీ భవన్ లో మాట్లాడుతూ జన్వాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘జన్వాడ భూములన్ని కేటీఆర్ వే. అందులో ఎలాంటి సందేహం లేదు. నాళాలన్నీ కూలగొట్టి కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టారు. కేటీఆర్ కు పౌరుషం ఉంటే ఫామ్ హౌస్ ను కూలగొట్టాలి.. అప్పుడు మేము హర్షిస్తాం. ఆరోజు డ్రోన్ తిరుగుతుంటే కేటీఆర్ కు అక్కడ ఏమి పని? FTL లో ఉన్న ఎవరినైనా వదిలే ప్రసక్తే లేదు. సీఎం రేవంత్ రెడ్డి హైడ్ ను ఏర్పాటు చేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. హైడ్రాకు మంచి పేరు వస్తుందని విగ్రహాల పేరుతో కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారు.


కేటీఆర్, హరీష్ రావుల శకం ముగిసింది. బీఆర్ఎస్ పార్టీ కూలిపోయే పరిస్థితిలో బీజేపీని పట్టుకొని వేలాడుతున్నారు. దురాక్రమణకు గురైన ప్రభుత్వ ఆస్తులను హైడ్రా కాపాడుతుంది. హైడ్రాపై రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని టీపీసీసీ అభినందిస్తుంది. లక్ష చదరపు అడుగుల్లో పామ్ హౌస్ ఉంది. ఎవరైనా భూములను లీజుకు తీసుకుంటారు. కానీ, కేటీఆర్ మిత్రుడి పామ్ హౌస్ ను లీజుకు తీసుకున్న అని కొత్త డ్రామా కు తెర లేపిండు. అది కేటిఆర్ పామ్ హౌస్ అని పోలీసులు రిపోర్ట్ ఇచ్చారు. అక్రమ కట్టడమని రేవంత్ రెడ్డి ఎన్జీటీకి వెళితే అరెస్ట్ చేశారు.

Also Read: బీఆర్ఎస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్..ఏంటో తెలుసా?


జన్వాడ ఫామ్ హౌస్ భూములన్నీ ఆయన సతీమణి శైలిమ పేరు మీద ఉన్నాయి. ఆ ఫామ్ హౌస్ ను ప్రైవేట్ వ్యక్తిని బెదిరించి లాక్కున్నాడు. గతంలో మున్సిపల్ మంత్రిగా ఉండి ఎక్కడ ఫారెస్ట్ భూములు, ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలియదా? 40 లక్షల మందికి ఋణమాఫీతో లబ్ధి చేకూరుంది. ప్రతి పక్షాలు చేసే విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×