BigTV English

Fire Accident: SSC కెమికల్ ఫ్యాక్టరీలో.. భారీ అగ్ని ప్రమాదం

Fire Accident: SSC కెమికల్ ఫ్యాక్టరీలో.. భారీ అగ్ని ప్రమాదం

Fire Mishap SSC Chemical Factory in Anakapalli district: అనకాపల్లి జిల్లా‌లో భారీ పేలుడు సంభవించింది. ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందారు. కాగా, సుమారు 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువ ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నది.


క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం తప్పింది.గ్రామాల్లో చుట్టూ పొగ అలుముకోవడంతో.. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎసెన్షియా కెమికల్ ఫ్యాక్టరి ప్రమాదంపై స్పందించారు హోం మంత్రి అనిత. అనకాపల్లి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు.ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ లోపలకి, బయటకి ఏ ఒక్కరిని కూడా రాకపోకలు జరగకుండా అక్కడి మేనేజ్మెంట్, సెక్యూరిటీ చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే రియాక్టర్ పేలిన సమయంలో ఏవైనా కెమికల్స్ కూడా ఆ ప్రాంతం అంతా స్ప్రెడ్ అయితే దాని ద్వారా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవ్వరిని లోపలికి వెళ్లనివ్వకుండా గేట్లు వేశారు.

Also Read: దమ్ముంటే ఆ లెక్కలు బయటపెట్టు.. చంద్రబాబుకు పేర్ని నాని సవాల్


ఈ ప్రమాదానికి సంబంధించి గల కారణాలైతే తెలియాల్సి ఉంది. లంచ్ సమయం కావడంతో పెను ప్రమాదం అయితే తప్పింది. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇలాంటి ప్రమాదాలు తరుచు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలు జరిగినా కూడా వాటిని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన ఫ్యాక్టరీకి సంబంధించి డిపార్ట్మెంట్ నిమ్మకు నీరెత్తిన్నట్లు వ్యవహరించడం వల్లన ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని విమర్శలు కూడా ఉన్నాయి. కేవలం ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే తనిఖీలు చేస్తారు తప్ప మిగిలిన రోజుల్లో పట్టించుకోలని అక్కడున్న స్థానికులు చెబుతున్నారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×