BigTV English

KTR: బీఆర్ఎస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్..ఏంటో తెలుసా?

KTR: బీఆర్ఎస్‌కు కొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్..ఏంటో తెలుసా?

KTR Press Meet updates(Political news in telangana): బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని.. భారత రైతు సమితి అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఎప్పటిలోగా రుణమాఫీ చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కుచ్చుటోపీ పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ ది ఒక మాట అయితే మంత్రులది మరోమాట అన్నారు. రుణమాఫీ విషయంలో మంత్రులకే సమన్వయం లేదని విమర్శలు చేశారు. వాస్తవాలు దాచేస్తే దాగవని, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ రుణమాఫీ పూర్తిగా కాలేదన్నారు. కోస్గి మండలంలో 22వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 8వేల మందికి మాత్రమే రుణమాఫీ వచ్చిందన్నారు.

మాటల గారడితో ప్రజలను మోసం చేస్తే కుదరదని, లెక్కలు చూపించాలని సవాల్ విసిరారు. రైతులు ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడి చేస్తున్నారని, దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలన్నారు. ఇది రైతు రాజ్యం కాదని..రైతును ఏడిపిస్తున్న రాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని, దీనికి నిరసనగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తామని వెల్లడించారు. రుణమాఫీ సగం కాదు కదా..పావులా శాతం కూడా కాలేదన్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్న రైతులపై ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రైతుల తరఫున పోరాడేందుకు బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని వెల్లడించారు. సీఎం, మంత్రివర్గం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా గురువారం అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేపడతామని వెల్లడించారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు..ఎవరు పెట్టారో తెలుసా?

ఇదిలా ఉండగా, ఫాంహౌస్ గురించి కేటీఆర్ మాట్లాడారు. నాకు ఫాంహౌస్ లేదని, నా మిత్రుడికి ఉన్న పాంహౌస్ ను లీజుకు తీసుకున్నాని చెప్పారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌లో ఫాంహౌస్ ఉంటే నేనే దగ్గరుండి కూల్చివేయిస్తానని వెల్లడించారు. తప్పు ఉంటే ఫాంహౌస్ కూల్చివేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×