Big Stories

Modi : ఫ్యామిలీ ఫస్ట్ కాదు పీపుల్ ఫస్ట్..దోపిడిదారులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు:మోదీ

Modi : తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ లో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మునుగోడు ఉపఎన్నిక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలంతా తరలివచ్చారన్నారు. ఉపఎన్నిక కోసం ప్రభుత్వం మొత్తం తరలివచ్చిందన్నారు. అంటే ఓటమి భయంతో ఎంత గట్టిగా పోరాడారో ఉపఎన్నికను బట్టి అర్థమైందని మోదీ చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలుస్తోందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

- Advertisement -

కేసీఆర్ కు కౌంటర్

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఐటీ హబ్ హైదరాబాద్ లో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయన్నారు. తెలంగాణలో మూఢనమ్మకాలతో ఏం జరుగుతుందో దేశ ప్రజలకు తెలియాలన్నారు. కేబినెట్ లో ఎవరిని ఉంచాలో ఎవరిని తీసేయాలో మూఢనమ్మకాలు నిర్ణయిస్తున్నాయని మోదీ ఆరోపించారు.

మోదీ వార్నింగ్
తెలంగాణను దోచుకున్న వాళ్లను విడిచిపెట్టే ప్రసక్తే లేదని మోదీ వార్నింగ్ ఇచ్చారు. అవినీతిపరులంతా ఒక్కటయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆన్ లైన్ పేమెంట్ తో అవినీతికి కూడా చెక్ పడుతోందని ప్రధాని స్పష్టం చేశారు. తెలంగాణ పేరు చెప్పి పార్టీలు పెట్టినవారు పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. ఆ నాయకులు తెలంగాణ ప్రజలను మాత్రం పట్టించుకోవడంలేదని కేసీఆర్ ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నారని మోదీ విమర్శించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News