Big Stories

Moinabad Farm House Case : ఆ ముగ్గురిపై కేసులివే

Moinabad Farm House Case : తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యేలు ముడుపుల ఇవ్వజూపిన వ్యవహారంలో ఆ ముగ్గురి నిందితులపై 120 B,171 B,రెడ్ విత్ 171 E,506,రెడ్ విత్ ఐపీసీ 34, యాక్ట్ సెక్షన్ 8 కింద కేసులు నమోదు చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఎప్పటి నుంచి సంప్రదింపులు జరిపారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. మొయినాబాద్ ఫాంహౌస్ లోని సీసీటీవీ ఫుటీజీని పరిశీలిస్తున్నారు.

- Advertisement -

ఎఫ్ఐఆర్ లో ఉన్న కీలకాంశాలు ఇవే

- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. బీజేపీలో చేరితే రూ. 100 కోట్లు ఇప్పిస్తామని రామచంద్ర భారతి ఆఫర్ చేశారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే ఆ డబ్బు ఇస్తామని హామీ ఇచ్చారని రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. సెంట్రల్ సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇప్పిస్తామని మధ్యవర్తులు ఆఫర్ చేసినట్లు తెలిపారు. తనతోపాటు బీజేపీలో చేరే వారికి రూ. 50 కోట్లు ఆఫర్ చేశారని రోహిత్ రెడ్డి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. రామచంద్ర భారతి, నందకుమార్ బీజేపీకి చెందిన వ్యక్తులుగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రోహిత్ రెడ్డి వివరించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలనే ఎఫ్ఐఆర్ లో పొందుపర్చారు పోలీసులు. ఇప్పుడు ఇదే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు చేయాలనే కుట్ర వెనుక ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే విషయంపై దృష్టి పెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News