Coimbatore Car Blast : తమిళనాడు కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు కేసుతో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఈ ఘటనలో పోలీసులు అఫ్సర్ ఖాన్ అనే మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీం అతన్ని పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. తాజాగా అరెస్ట్ అయిన అఫ్సర్ ఖాన్.. ఈ పేలుడు ఘటనలో మృతి చెందిన ముబిన్ సమీప బంధువుగా పోలీసులు గుర్తించారు. దీంతో… మొత్తం ఆరుగురు పోలీసుల అదపులో ఉన్నారు. అటు ఈ ఘటన వెనుక ఉగ్రకుట్ర ఉందనే అనుమానాలు రావడంతో కేసు దర్యాప్తు కోసం NIA కూడా రంగంలోకి దిగింది.
నిందితుడు అఫ్సర్ ఖాన్.. పేలుడు పదార్ధాలైన పొటాషియం నైట్రేట్, అల్యుమీనియం పౌడర్, సల్ఫర్, చార్కోల్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి లింక్స్ ఉన్న 5గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు సంవత్సరాల ముందే వీరు పేలుడు పదార్ధాలను కొనుగోలు చేసి కోయంబత్తూర్‌లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నారు. అఫ్సర్ ఖాన్ ఇంట్లో పోలీసులు కార్డన్ సర్చ్ చేయగా 75కేజీల పొటాషియం నైట్రట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన అఫ్సర్ ఖాన్ గత పదేళ్లుగా ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం కొట్టైమెడులోని సంగమేశ్వర్ ఆలయం ముందు కారు బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ దుర్ఘటనలో జమీషాముబీన్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ కారు బ్లాస్టుకు కేసును కోయంబత్తూర్ పోలీసుల నుంచి తీసుకొని తాము ఇన్వెస్టిగేట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు.