E-Paper
Advertisement

Medchal-Malkajgiri : నోట్లు, చీరలు.. మల్లారెడ్డి ప్రలోభాల పర్వం..!

Medchal-Malkajgiri : నోట్లు, చీరలు.. మల్లారెడ్డి ప్రలోభాల పర్వం..!
Advertisement

Medchal-Malkajgiri : మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లా పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో.. నోట్ల కట్టలు, చీరల బాక్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జక్కా వెంకటరెడ్డి ఇంట్లో భారీగా డబ్బు, చీరలు ఉన్నాయంటూ ఆదివారం రాత్రి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగడంతో.. వారిపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. ఈ సమయంలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.

గొడవ సద్దుమణిగిన తర్వాత జక్కా వెంకటరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో నోట్ల కట్టలు, చీరల బాక్సులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుందాం అని ముద్రించి ఉన్న కరపత్రాలు చీరల బాక్సుల్లో కనిపించాయి.

Advertisement

పోలీసుల సోదాలకు ముందే భారీగా డబ్బు, చీరల బాక్సులు అక్కడి నుంచి తరలించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాము ఆందోళనకు దిగిన వెంటనే సోదాలు జరిపి ఉంటే భారీ మొత్తంలో డబ్బు దొరికేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. సోదాలు ఆలస్యం కావడం వల్లే మల్లారెడ్డికి చెందిన నోట్ల కట్టల్ని మాయం చేశారని ఆరోపిస్తున్నారు.

.

Advertisement

.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×