త్రిపుర రాజధాని అగర్తాలలోని ప్రతిష్టాత్మక రామ్ ఠాకూర్ కాలేజీ గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. దేశంలోని టాప్ కాలేజీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. నాణ్యమైన విద్యను అందించడంలో ఈ కాలేజీకి మంచి పేరు ఉంది. ఈ కాలేజీలో విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఉంటారన అందరూ భావిస్తారు. కానీ, తాజాగా ఈ కాలేజీలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కు గురి చేసింది. కాలేజీలోని యువతులు బహిరంగంగా కొట్లాడుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. కాసేపట్లోనే నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఘటనపై తాజాగా యాజమాన్యం సీరియస్ అయ్యింది. గొవడకు కారణం కావడంతో పాటు తోటి విద్యార్థిపై దాడికి పాల్పడిన యువతిపై సస్పెన్షన్ వేటు వేసింది.
రామ్ ఠాకూర్ కాలేజీలో ఐదవ సెమిస్టర్ చదువుతున్న ఒక విద్యార్థిని మరో విద్యార్థినితో బహిరంగంగా గొడవకు దిగింది. అంతేకాదు, గొడవ పడుతున్న సమయంలో క్లాస్ మేట్ ను తన్నినట్లు వైరల్ వీడియోలో కనిపించింది. ఇందులో సదరు విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగుతున్నట్లు ఉంది. ఈ ఘటనను పక్కనే ఉన్న విద్యార్థులు రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాసేపట్లోనే ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫుటేజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. కాలేజీ ప్రతిష్టను దెబ్బతీసింది. వెంటనే సరదు విద్యార్థిపై యాజమాన్యం క్రమశిక్షణా చర్య తీసుకోవాలని నెటిజన్లు డామిండ్ చేశారు. అటు ఈ గొడవకు సంబంధించి బాధిత విద్యార్థిని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అయితే, ఈ ఘటన గురించి ముందుగా కాలేజీ యాజమాన్యానికి తెలియజేయాలని పోలీసు అధికారులు ఆమెకు సూచించారు. ఈ ఘటన అక్టోబర్ 15న జరిగింది.
ఈ గొడవకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో యాజమాన్యం సీరియస్ అయ్యింది. అదే సమయంలో బాధిత విద్యార్థిని పేరెంట్స్ ప్రిన్సిపాల్ పాప్రి దాస్ సేన్ గుప్తాను కలిశారు. జరిగిన ఘటన గురించి వివరించారు. తమ కూతురుపై దాడి చేసిన విద్యార్థిపై చర్యలు తీసుకోడాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జోక్యం చేసుకున్న కాలేజీ యాజమాన్యం నిబంధనల ప్రకారం.. దాడికి పాల్పడిన విద్యార్థినిని కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఘటనపై ప్రిన్సిపాల్ పాప్రి దాస్ సేన్ గుప్తా స్పందించారు. విద్యార్థుల మధ్య వాదాలు అసాధారణం కాదని, కానీ. ఇలా బహిరంగంగా కొట్లాడుకోవడం కరెక్ట్ కాదన్నారు. ఈ గొడవకు కారణం అయిన విద్యార్థినిని సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. “ఈ వయస్సులో విద్యార్థులు తరచుగా వాదించుకుంటారు. కొట్లాడుకుంటారు. ఆ తర్వాత కలిసిపోతారు. కానీ, ఇటువంటి సంఘటనలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినప్పుడు, విద్యా సంస్థ ప్రతిష్టకు హాని కలిగిస్తాయి” అని సేన్ గుప్తా వ్యాఖ్యానించారు. రామ్ ఠాకూర్ కాలేజీ అగర్తలాలో ఉంది. 1967లో దీనిని స్థాపించారు. దేశంలోని ప్రతిష్టాత్మక కాలేజీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: రైల్లో సీటు కోసం అన్నాదమ్ముల కంత్రీ ఐడియా.. చివరికి కటకటాల్లోకి..