Telangana : అంతా నిజమే అంటున్నారు. BJPలో BRS విలీనం కన్ఫామ్ అని చెబుతున్నారు. కవిత జైల్లో ఉన్నప్పుడే డీల్ మాట్లాడారట. కవితనే అడ్డుకుందట. ఈ మాట మరెవరో చెబితే అంత వాలిడ్‌గా ఉండకపోవచ్చు. జనాలు నమ్మకపోయేవారేమో. కానీ, స్వయంగా కవితనే చెప్పడం తెలంగాణ పాలిటిక్స్‌లో కాక రేపుతోంది. విలీనంపై వివాదం ఓ రేంజ్‌లో సాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్.. మూడు పార్టీలు మంట రాజేస్తున్నాయి.
విలీనంపై బండి క్లారిటీ..
బీజేపీతో బీఆర్ఎస్ కుమ్మక్కు నిజమేనన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. పెద్ద ఆఫర్ ఉంటే మా పార్టీ పెద్దలు ఏదైనా చేస్తారని ఓపెన్‌గానే చెప్పేశారు. రాజాసింగే కదా.. ఆయన అలానే అంటారులే అనుకోటానికి లేదు. ఎందుకంటే.. లేటెస్ట్‌గా మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ బండి సంజయ్ సైతం అదే విషయం స్పష్టం చేశారు. కవిత అరెస్టుని ఆపడానికి బీజేపీతో కలవాలని చూసినప్పుడే బీఆర్ఎస్‌ను దగ్గరికి రానివ్వలేదని అసలు విషయం ఫ్లో లో కక్కేశారు. బండి స్థాయి నేత ఈ మాట అనడంతో.. ఇక వేరే క్లారిటీ ఏం కావాలి?
పదే పదే విలీన ప్రయత్నం?
బండి సంజయ్ మాటలను బట్టి చూస్తే.. కవిత అరెస్టు సమయంలో బీఆర్ఎస్‌ను.. బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన తీసుకొచ్చారని తెలుస్తోంది. ఆ సమయంలో కేటీఆర్ సైతం పలుమార్లు ఢిల్లీ వెళ్లి.. కాషాయ పెద్దలను కలిసి వచ్చారు. కానీ, వారు రిజెక్ట్ చేశారని అర్థం అవుతోంది. ఆ తర్వాత కవిత జైల్లో ఉన్నప్పుడు మరోసారి విలీనం ప్రపోజల్ పెట్టారని కవిత బయటపెట్టింది. ఇప్పుడు కూడా ఆ కుట్ర జరుగుతోందని.. తాను ఉంటే అది సాధ్యం కాదనే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంటే, పదే పదే బీజేపీతో కాళ్ల బేరానికి బీఆర్ఎస్ వెళ్లినట్టేగా? కవితకు బెయిల్ రావడం వెనుక ఏదో డీల్ ఉన్నట్టేగా? కవిత, రాజాసింగ్, బండి సంజయ్.. ఇంత మంది చెబుతున్నా ఇంకా డౌటా?
Also Read : ఫ్లైఓవర్‌పై ఫిట్స్.. మంత్రి సీతక్క ఏం చేసిందంటే..
రాజాసింగ్‌నే అడగండి..
చెప్పాల్సింది చెప్పేసి.. ఆ తర్వాత బీఆర్ఎస్‌పై విమర్శలకు దిగారు బండి సంజయ్. బీఆర్ఎస్, బీజేపీలు ఎన్నటికీ కలవవు అని చెప్పారు. అవినీతి పార్టీ, కుటుంబ పార్టీని తాము దగ్గరికి రానివ్వమని తెలిపారు. కల్వకుంట్ల ఆర్ట్ ప్రొడక్షన్‌లో తెలంగాణల చార్‌పత్తా సినిమా నడుస్తోందని సెటైర్లు వేశారు. కవిత, కేటీఆర్, సంతోష్ ,హరీష్‌రావులు.. చార్‌పత్తా అయితే.. కేసీఆర్ జోకర్ అన్నారు బండి సంజయ్. బీఅర్ఎస్, బీజేపీ కలవడం నిజమేనన్న రాజాసింగ్ వ్యాఖ్యాలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ఆ విషయం రాజాసింగ్‌నే అడగండి అంటూ మేటర్ సైడ్ చేశారు. అంటే, ఏదో జరుగుతోంది. అంతా అంటున్నట్టుగానే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఏదో డీల్ ఉండే ఉంటుంది. విలీనమా? పరోక్ష సహకారమా? కాంగ్రెస్‌ను దెబ్బకొట్టే వ్యూహమా?