Indian Railways Special Trains: వేసవి సెలవులు దగ్గరపడుతున్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తోంది. సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరాల బాట పట్టడంతో రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే 150 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. అవసరం అయితే, మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 1300 పైగా రైళ్లను నడిపినట్లు ప్రకటించింది.
సికింద్రాబాద్-కాకినాడ నడుమ 16 ప్రత్యేక రైళ్లు
వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే.. తాజాగా సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య 16 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు రైళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించింది. రైళ్ల షెడ్యూల్ తో పాటు ఏ స్టేషన్లలో ఆగుతాయి అనే విషయాలను వెల్లడించింది.
ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ఇదే!
సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ కు వెళ్లే ప్రత్యేక రైలు (07041) గురువారం రాత్రి 10:40 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 10:45 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 12, 19, 26తో పాటు జూలై 3, 10, 17, 24, 30 తేదీలలో నడుస్తుంది. అటు కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే ప్రత్యేక రైలు(07042) శుక్రవారం ఉదయం 6:55 గంటలకు బయలుదేరి శనివారం ఉదయం 07:00 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 13, 20, 27, జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1 తేదీలలో నడుస్తుంది.
Read Also: ఇక రైళ్లలోనూ.. అండర్ కవర్ రైల్వే అధికారులు, వీళ్లు ఏం చేస్తారో తెలుసా?
ప్రత్యేక రైళ్లు ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?
సికింద్రాబాద్- కాకినాడ- సికింద్రాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లు రెండు దిశలలో ఆగుతాయని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లలో ఫస్ట్ AC, సెకెంబ్ AC, థర్డ్ AC కోచ్ లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ప్రత్యేక రైళ్లను సుమారు రెండు నెలల పాటు నడపనున్నట్లు తెలిపింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణీకులకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణీకులు వీటి ఉపయోగించుకుని ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు చెయ్యొచ్చన్నారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కామారెడ్డి సహా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించారు.
Read Also: ఇండియన్ బుల్లెట్ రైలు పరుగు మొదలు.. ఇదిగో చూసేయండి!