Nagarjuna :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న నాగార్జున (Nagarjuna) తాజాగా తన భార్య అమల (Amala) తో సహా పలువురు కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)ని కలిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే సడన్ గా నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం వెనుక అసలు కారణం ఏంటి? అని నెటిజన్స్ కూడా ఆరా తీయగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం , అఖిల్ అక్కినేని (Akhil Akkineni) వివాహ వేడుక దగ్గర పడుతున్న నేపథ్యంలో.. వివాహ వేడుకకు ఆహ్వానాన్ని అందించడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే అక్కినేని ఇంట ఇప్పుడు పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే ఇలా ఒక్కొక్కరిని దగ్గరుండి మరీ ఆహ్వానిస్తున్నారట నాగార్జున దంపతులు. అందులో భాగంగానే తమ ఇంటి జరిగే ఈ వేడుకకు మొదటి పత్రికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించినట్లు సమాచారం.
పెళ్లి పీటలెక్కనున్న అఖిల్ – జైనాబ్ :
అక్కినేని ఇంట ఇప్పుడు మరో శుభకార్యం జరగనుంది. త్వరలో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున చిన్న కొడుకు ప్రముఖ హీరో అఖిల్ అక్కినేని త్వరలో ఏడడుగులు వేయబోతున్నారు. తాను ప్రేమించిన అమ్మాయి జైనాబ్ రవ్ డ్జీ తో కలసి ఏడడుగులు వేయబోతున్నారు. ఇకపోతే గత ఏడాది నవంబర్ లోనే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. ఇక కాబోయే కొత్త కోడలు, తన చిన్న కొడుకు ఉంగరాలు మార్చుకున్న ఫోటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రేమ జంట పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. జూన్ 6వ తేదీన అఖిల్ వివాహం జరగనున్నట్లు సమాచారం . అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇప్పుడు మరొకవైపు నాగార్జున దంపతులు కూడా సీఎంని కలిసి వెడ్డింగ్ కార్డు ఇవ్వడంతో ఇదే డేట్ పై అందరూ క్లారిటీకి వస్తున్నారు. ఇక త్వరలోనే అక్కినేని కుటుంబం పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఘనంగా పెళ్లి వేదిక సిద్ధం..
ఇకపోతే నాగచైతన్య(Naga Chaitanya) , శోభితం దూళిపాల (Shobhita dhulipala) వివాహం లాగానే అఖిల్ వివాహాన్ని కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరిపించడానికి నిర్ణయించుకున్నారట. అందుకే పెళ్లికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. మొత్తానికి అయితే అక్కినేని నాగచైతన్య లాగే అక్కినేని అఖిల్ కూడా అన్నపూర్ణ స్టూడియోలో తన తాతయ్య దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) విగ్రహం ముందు వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుతం అక్కినేని అఖిల్ కాబోయే భార్య అందం చూసి, ఆమె బ్యాగ్రౌండ్ తెలిసి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:R.Narayana Murthy: పవన్ నువ్వు తప్పు చేశావు.. థియేటర్స్ బంద్‌పై ఆర్.నారాయణ మూర్తి వైరల్ కామెంట్స్!