Big Stories

MP Aravind on MLC Kavitha: నేను అవినీతి చేయలేదు.. నాకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత జైలులో ఉంది: ఎంపీ అర్వింద్!

MP Dharmapuri Aravind Comments on MLC Kavitha: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఎంపీగా ఉన్న ఐదేళ్లలో నా పై ఎలాంటి అవినీతి రాలేదు. కానీ నా కంటే ముందుగా ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం జైలులో ఉన్నారు. అవినీతి చేయాల్సి వస్తే నేను రాజకీయాలను వదిలేసుకుంటాను అంతే తప్ప తప్పు మాత్రం చేయను’ అని ఆయన అన్నారు.

- Advertisement -

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరులో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చానన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే జక్రాన్ పల్లి ఎయిర్ పోర్ట్ ఏడాదిలోగా తెరుచుకోవొచ్చంటూ ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

ఇటు రాష్ట్రంలో, అటు దేశ వ్యాప్తంగా అత్యధిక ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు. తనను గెలిపిస్తే నిజామాబాద్ ను మరింతగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: రూ. 150తో హైదరాబాద్‌కు వచ్చా.. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా: సీఎం రేవంత్ రెడ్డి

ఇదిలా ఉండగా, ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన బీజేపీ.. అగ్రనేతలను తెలంగాణకు పంపింది. దీంతో వారు తెలంగాణలో అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలలో పాల్గొంటున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ గవర్నర్ తమిళి సై తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ప్రముఖ ఆనాటి హీరోయిన్, బీజేపీ నాయకురాలు నవనీత్ కౌర్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఆమె పాల్గొని ప్రసంగించిన విషయం విధితమే.

అయితే, నిజామాబాద్ ఎంపీ స్థానానికి బరిలో బీజేపీ నుంచి అర్వింద్, అటు కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్థన్ ఉన్నారు. గెలుపు కోసం వీరు ముగ్గురూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ కీలకంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News