BigTV English

Heatwave Over in India: గుడ్ న్యూస్.. ఇక వడగాలుల్లేవ్.. ఈ రాష్ట్రాలకు వర్షసూచన: ఐఎండీ!

Heatwave Over in India: గుడ్ న్యూస్.. ఇక వడగాలుల్లేవ్.. ఈ రాష్ట్రాలకు వర్షసూచన: ఐఎండీ!

Heatwave is Almost Over in India: మండువేసవి నుంచి దేశప్రజలకు ఉపశమనం లభిస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. 2 రాష్ట్రాల్లో మినహా.. దేశమంతా హీట్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. బంగాళాఖాతం నుంచి తేమ పెరగడంతో.. ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు పడతాయని అంచనా వేసింది. వడగాలుల కాలం దాదాపు ముగిసినట్లేనని, ఇక కొన్ని రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది.


శుక్రవారం పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశమంతా వేడిగాలులు తగ్గుతాయని ఐఎండీ శాస్త్రవేత్త సోమా సేన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు చెప్పారు. హీట్ వేవ్ తగ్గినప్పటికీ.. వర్షాలు అధికంగా ఉంటాయో లేదో అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలలో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవవచ్చని తెలిపారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలతో పాటు.. అస్సాం, మేఘాలయ సమీప రాష్ట్రాల్లోనూ పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని చెప్పారు.

మరోవైపు నేటి నుంచి చార్ ధామ్ యాత్ర మొదలైంది. ఉదయం 7.10 గంటలకు జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం.. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. అక్షయ తృతీయ సందర్భంగా ఆలయాన్ని 40 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఆలయం తలపులు తెరచుకోగానే హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిసింది.


Also Read: ఎండలల్లో ఇదే రికార్డు.. దేశంలో ఎన్నడూ లేనంతగా భారీగా..

మరోవైపు తెలంగాణలో 2 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Related News

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Big Stories

×