E-Paper
Advertisement

Municipal Elections 2026: కారుకు జోష్.. కమలానికి బ్రేక్..? హస్తం పార్టీ సరికొత్త వ్యూహం వెనుక అసలు మతలబు ఇదే!

Municipal Elections 2026: కారుకు జోష్.. కమలానికి బ్రేక్..? హస్తం పార్టీ సరికొత్త వ్యూహం వెనుక అసలు మతలబు ఇదే!
Advertisement

Municipal Elections 2026: ఏ రాజకీయ  పార్టీ అయినా ప్రత్యర్ది పార్టీని బలహీన పరిచి లబ్ది పొందాలనుకుంటుంది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో అటువంటి స్ట్రాటజీలు మరింత బలంగా అమలు చేయాలని చూస్తుంటాయి. కానీ రాష్ట్ర కాంగ్రెస్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థి బలం పెంచి లబ్ది పొందాలని చూస్తోందంట. ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ అమలు చేస్తున్న ఈ కొత్త వ్యూహం అత్యంత ఆసక్తికరంగా మారింది. అసలు హస్తం పార్టీ ఆ వ్యూహాన్ని అమలు చేయడం వెనక ఉన్న మతలబు ఏంటి?.. ఆ గేమ్‌ప్లాన్‌తో కాంగ్రెస్ అనుకున్న ఫలితాలు సాధిస్తుందా?

మున్సిపల్ ఎన్నికల వేల హస్తం పార్టీ సరికొత్త వ్యూహం తో ముందుకు వెళ్లి లబ్ది పొందడానికి యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోంది.. ఏ రాజకీయ పార్టీ అయినా మాములుగా అయితే ప్రత్యర్దిని బలహీన పరచి గెలవాలనుకుంటుంది.. కానీ అధికార కాంగ్రెస్  మాత్రం ప్లాన్ మార్చింది.. ప్రత్యర్థి బలం పెంచి గెలవాలనుకుంటోందంట.. ఇది కొంత విచిత్రంగా ఉన్నా తాము చేసేది కరెక్టే అంటున్నారు హస్తం పార్టీ నేతలు.

Advertisement

ప్రస్తుతం జరిగే మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రాంతంలోనే జరగనున్నాయి ..తెలంగాణలో పట్టణ ప్రాంతాల్లో ప్రధాని మోడీ ప్రభావం, హిందుత్వ అజెండాలతో బీజేపీ పట్టుపెంచుకునే ప్రయత్నం చేస్తోంది. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో లోకసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు షేర్ గణనీయంగా పెరిగింది.. ఆ క్రమంలో చాలా చోట్ల అధికార కాంగ్రెస్ కు బీజేపీ సవాల్ విసురుతోంది.. ఈ నేపథ్యంలో బీజేపీని కట్టిడి చేయాలంటే బీఆర్ఎస్‌కు బలం చేకూర్చడం ఒక్కటే మార్గమని కాంగ్రెస్ భావిస్తోందట.. తమ ప్రత్యర్ధులు ఇద్దరు అంతోఇంతో బలంగా ఉంటే ఓట్ల చీలిక జరుగుతుందని, ఫైనల్ గా అది తమకు లాభం చేకూర్చుతుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనా వేసుకుంటున్నారంట

అందుకు సంబంధించి సిట్ విచారణను అస్త్రం గా చేసుకుంది టీ కాంగ్రెస్..రాజకీయ కుట్ర గా బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే , తమకు ఏం సంబంధం లేదని కాంగ్రెస్ వాదిస్తుంది. ఏది ఏమైనా గత కొద్దిరోజులుగా సిట్ విచారణ సెంట్రిక్ గా కాంగ్రెస్ – బీఆర్ఎస్‌ల మధ్యే పొలిటికల్ వార్ నడుస్తోంది… కేసీఆర్ వంటి బీఆర్ఎస్ ముఖ్యనేతలను సిట్ అధికారులు విచారించడం తమకు సానుభూతిపరంగా ప్లస్ అవుతుందని గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్ కు కావాల్సింది కూడా ఇదే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి బీజేపీ బలం తగ్గితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ది చేకూరుతుందన్నది ఆ పార్టీ నేతల ప్లాన్‌‌ అంటున్నారు.

Advertisement

Also Read: వార్డు ఎన్నికల్లోనూ సర్పంచ్ ఎన్నికల దుస్థితేనా? పోటాపోటీగా ఖర్చులు.. ఓడితే బాధలు తప్పవా?

అటు బిఆర్ఎస్ కూడా మున్సిపల్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అధిష్టానం ముఖ్యనేతలను సిట్ విచారించడాన్ని, ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా ఫోకస్ చేస్తూ దాన్ని గట్టిగా వాడుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. ఈ అవకాశాన్ని సమర్దవంతంగా వాడుకోవాలని డిసైడ్ అయింది . కాంగ్రెస్ వ్యూహాన్ని గమనించిన బీఆర్ఎస్… నేతల చేరికలు ప్రోత్సహిస్తూ కాంగ్రెస్  గేమ్‌ప్లాన్‌కు చెక్ పెట్టి  ఓడించాలని వ్యూహం రచిస్తుందట.. మొత్తంగా హస్తం పార్టీ రివర్స్ వ్యూహం ఆ పార్టీ ని గట్టెక్కిస్తుందో లేక నిండా ముంచుతుందో చూడాలి మరి.

Related News

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×