Munnuru Kapu Leaders: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఏదో విధంగా అధికార పార్టీని బద్నాం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారా? కాంగ్రెస్ సీనియన్ నేత వీహెచ్ ఇంట్లో జరిగిన భేటీ నేతల డిమాండ్లు ఏంటి? గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? దీని వెనుక పెద్ద స్కెచ్ ఉందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
శనివారం కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో తెలంగాణలోని మున్నూరు కాపు నేతలంతా సమావేశమయ్యారు. దీనికి వివిధ పార్టీలకు చెందిన మున్నరు కాపు నేతలంతా హాజరయ్యారు. కులగణనపై నేతలంతా సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం సీట్లు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీలు సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.
మున్నూరు కాపులకు కోకాపేట్‌లో ఇచ్చిన ఆత్మగౌరవ భవన నిర్మాణానికి తగిన ప్రాధ్యానత ఇస్తూనే, 10 వేల కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు నేతలు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కనీసం 20వేల మందికి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని తీర్మానించారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న కాచిగూడ మున్నూరు కాపు సంఘ భవనాన్ని తిరిగి ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. తమ సత్తా ఏంటో చూపించాలని నేతలందరూ తీర్మానం చేశారు. ఆ సభకు ఛైర్మన్ వీహెచ్, సలహదారుడిగా కేకే వ్యవహరించనున్నట్లు సమాచారం. దీనికితోడు ఉమ్మడి ఏపీలో తమ కమ్యూనిటీకి మంత్రి పదవి ఉండదేని, ఈ ప్రభుత్వంలోనూ అవకాశం ఇవ్వాలని నేతలంతా ప్రభుత్వాన్ని కోరనున్నారు.
ALSO READ: సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ సందర్శన
విప్ ఆది శ్రీనివాస్‌కు మంత్రి పదవి ఇవ్వాలన్నది నేతల డిమాండ్. ఆపై ఓ తీర్మానం కూడా చేశారు. నామినేటెడ్ పోస్టుల్లోనూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నది మరొక డిమాండ్. ప్రత్యేకంగా కులం తరపున సర్వే కమిటీ వేసినట్టు తెలుస్తోంది. మున్నూరు కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఛైర్మన్‌ను నియమించాలన్నది కొందరు నేతల మాట. తాజా రాజకీయాలపై చర్చించిన వివిధ పార్టీల నేతలు, పార్టీలకు అతీతంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు.