BigTV English

Bandla Krishna Mohan: కన్‌ఫ్యూజన్‌లో ఎమ్మెల్యే..! ఇంతకీ సదరు నేతకు వచ్చిన కష్టమేంటి?

Bandla Krishna Mohan: కన్‌ఫ్యూజన్‌లో ఎమ్మెల్యే..! ఇంతకీ సదరు నేతకు వచ్చిన కష్టమేంటి?

Bandla Krishna Mohan Reddy: సాధారణంగా జనాలను…నేతలు కన్ఫ్యూజ్ చేస్తుంటారు. అలాంటిది ఓ ఎమ్మెల్యే.. ఒక విషయంలో తికమక పడుతున్నారట. ఎన్నికల్లో గెలిచినా.. తాను ఏ పార్టీలో ఉన్నానోనని చెప్పుకునే స్థితి లేదట. అసలు మీరు ఏ పార్టీలో ఉన్నారని అడిగితే.. కనీసం సమాధానం చెప్పుకోలేకపోతున్నారట. ఇంతకీ సదరు నేతకు వచ్చిన కష్టమేంటి? ఆయన నోరు మెదపకపోవడానికి కారణాలేంటి? వాచ్ దిస్ స్టోరీ.


గద్వాల్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు? ఆయన్ని గులాబీ ఎమ్మెల్యేగా చూడాలా.. లేక కాంగ్రెస్‌ అకౌంట్‌లో వేయాలా.. అనే సందేశాలు నియోజకవర్గంలో వస్తున్నాయట. ఆరు నెలల క్రితం కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు ఆయనే ప్రకటించారు. ఇప్పుడేమో తాను BRSలోనే ఉన్నాయని చెప్పడంతో నియోజకవర్గ ప్రజలకు కొత్త డౌట్‌లు వస్తున్నాయట. అందుకే.. ఆయన ఎక్కడ కనిపించినా.. సారూ.. మీరు ఏ పార్టీలో ఉన్నారనే సూటిగా ప్రశ్నిస్తున్నారట. తమకు ఓటేసి గెలిపించిన వాళ్లు.. ఇలా మెహం మీద అడుగుతుంటే.. ఏం చెప్పాలో తెలియక.. సదరు నేత ఇబ్బందిపడుతున్నారనే టాక్ నడుస్తోంది.

బీఆర్‌ఎస్‌ గుర్తుతో పోటీ చేసిన గెలిచిన బండ్ల కృష్ణమోహన్‌.. తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి టచ్ ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఆగ్రహానికి గురైన సదరు నేత.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్‌గా మారింది. ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్‌లో ఆయన రాశారట. నేను కారు పార్ఠీ నుంచే గెలిచాను. అదే పార్టీలోనే కొనసాగుతున్నాని చెబుతున్నా.. కొందరు నమ్మటం లేదని ఎమ్మెల్యే.. తన అనుచరుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.


కుట్రలో భాగంగా కొందరు కాంగ్రెస్ నేతలు.. ఫ్లెక్సీల్లో తన ఫోటోలను.. వారి పార్టీ కార్యక్రమాల్లో వేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారనేది సదరు ఎమ్మెల్యే వాదనగా తెలుస్తోంది. తద్వారా తన ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని కృష్ణమోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయటంతో.. ఒక్కసారిగా నేతలు అవాక్కు అయ్యారట. సమస్యలు తీర్చాల్సిన ఎమ్మెల్యేగారే.. తమ వద్దకు వచ్చి కంప్లైంట్ చేయటంతో.. పోలీసులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది.

Also Read: బీఆర్ఎస్ అగ్ని పరీక్షగా.. ఎమ్మెల్సీ ఎన్నికలు

అయితే ఎమ్మెల్యే ఫిర్యాదు, కామెంట్స్ వెనుక రాజకీయ వ్యూహం ఉందనే టాక్ వినిపిస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని BRS దాఖలు చేసిన పిటిషన్‌పై.. సుప్రీంకోర్టులో విచారణ నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో తనపై కాంగ్రెస్ ముద్ర పడితే ఇబ్బందులు వస్తాయనే ముందస్తు ఆలోచనతోనే సదరు నేత.. ఇలాంటి ప్రచారం చేసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కోర్టులో అనర్హత పిటిషన్‌ విచారణకు వస్తే తనకు ఇబ్బంది కలగకుండా ముందుగానే ఎమ్మెల్యే జాగ్రత్త పడుతున్నారనేది కొందరు మాటగా తెలుస్తోంది.

ఓ ఎమ్మెల్యే.. పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కి.. న్యాయం చేయండి అంటూ కంప్లైంట్ చేయటం ఏంటని పలువురు చర్చించుకుంటున్నారు. ఆయనపై తప్పుడు ప్రచారం ఏం జరుగుతుంది. వైషమ్యాలను ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇదే సమయంలో.. కృష్ణమోహన్ రెడ్డి ఫిర్యాదు అంశం చర్చగా మారిందట. సదరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న వర్గం. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయటంతో.. ఆయనకు మరిన్ని కష్టాలు వచ్చిపడుతున్నాయట. మంత్రి జూపల్లి కృష్ణారావు సపోర్ట్‌తో కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చారని.. తర్వాత రెండు వర్గాలుగా పార్టీలో చీలకలు వచ్చాయని మరో వర్గం ఆరోపణ చేస్తోంది. మొత్తానికి గద్వాల ఎమ్మెల్యే ఎపిసోడ్‌పై కాంగ్రెస్, BRS ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోననే ఉత్కంఠ నియోజకవర్గంలో ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×