
BRS party latest news(Political news today telangana):
జనగామ బీఆర్ఎస్ టికెట్ పెండింగ్ వ్యవహారం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్గీయుల మధ్య సోషల్ మీడియాలో వార్ తీవ్రమైంది. ఒకరిపై ఒకరు మాటల దాడి, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ విమర్శల స్థాయి పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది.
ముత్తిరెడ్డి అనుచరుడు తిప్పారపు విజయ్‌పై పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనుచరుడు కేశిరెడ్డి రాజేశ్‌రెడ్డి జనగామ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాఖీ పండుగ రోజు పల్లా పరువుకు భంగం కలిగించేలా విజయ్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయన ఆరోపించారు. విజయ్ ని స్థానిక పోలీసులు స్టేషన్ కు పిలిపించి మందలించి వదిలేశారు.
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సీరియస్ అయ్యారు. జనగామ సెంటర్లో తన అనుచరులతో కలిసి అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పల్లాపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పల్లా కబ్జాకోరు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.