BigTV English

Vyooham Song: వ్యూహం టైటిల్ సాంగ్.. ఆర్జీవీ మార్క్.. ఆఖర్లో మళ్లీ చంద్రబాబు డైలాగ్..

Vyooham Song: వ్యూహం టైటిల్ సాంగ్.. ఆర్జీవీ మార్క్.. ఆఖర్లో మళ్లీ చంద్రబాబు డైలాగ్..
RGV Vyooham Song

RGV Vyooham Song(AP political news) :

‘వ్యూహం’ టైటిల్ సాంగ్ రిలీజైంది. పులుల వేషంలో గుంట నక్కలు.. అంటూ సాగే ఈ సాంగ్‌లో మెయిన్‌గా చంద్రబాబునే టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది.


వ్యూహం మొదటి రెండు టీజర్లలో చూపిన క్యారెక్టర్లన్నింటినీ మరోసారి సాంగ్‌లో చూపించారు వర్మ. గాయత్రీ మంత్రంతో సాంగ్‌ ప్రారంభించడంలో ఆర్జీవీ మార్క్ కనిపించింది. వైఎస్సార్ చనిపోయినప్పుడు సోనియా, చంద్రబాబులు జగన్‌ను పరామర్శించడాన్ని చూపించారు.

జగన్‌ను సీబీఐ అరెస్ట్ చేయడం.. జేడీ లక్ష్మీనారాయణ విచారించడం.. ఈ పాటలో కనిపిస్తోంది. జగన్ పాదయాత్ర, భార్య భారతితో మానసిక సంఘర్షణను హైలైట్ చేశారు. మధ్య మధ్యలో పవన్ కల్యాణ్‌ రోల్, గాజు గ్లాసులను పదే పదే చూపించారు వర్మ. సోనియా చపాతీని రెండుముక్కలు చేసినట్టు.. రాష్ట్రాన్ని విభజించారనే సీన్‌ను సాంగ్‌లో కూడా చూపించారు. చంద్రబాబుకు డైనింగ్ టేబుల్ మీద పప్పు వడ్డించే షాట్‌ను ఈసారి కూడా వదిలిపెట్టలేదు వర్మ. మొత్తంగా ట్రైలర్‌లో చూపించిన విజువల్సే.. అటూఇటూ తిప్పి మళ్లీ సాంగ్ పేరుతో జనాల్లోకి వదిలినట్టుంది.


ట్రైలర్ మాదిరే పాట చివర్లో మళ్లీ చంద్రబాబు డైలాగ్‌ పెట్టారు ఆర్జీవి. ఏంటండి ఆ జనం.. మా నాన్న వెంటకానీ, వాళ్ల నాన్న వెంటకానీ అంత జనం రావడం ఎప్పుడూ చూడలేదంటూ చంద్రబాబు సతీమణి ఆయనతో అనడం.. “జనానికి బాగా పిచ్చి ముదిరింది”.. అంటూ చంద్రబాబు చెప్పే డైలాగ్‌తో సాంగ్ ఎండ్ చేశారు.

ఇప్పటికే వ్యూహం టీజర్, ట్రైలర్ రాజకీయ దుమారాన్నిరేపగా.. తాజాగా విడుదలైన సాంగ్ సైతం అంతే సంచలనం రేకెత్తించేలా ఉంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×