Naa Anveshana : ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే తెలంగాణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూమి గురించి మాట్లాడుకుంటున్నారు. దాదాపు 21 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత తెలంగాణ తన సొంత భూమిని తిరిగి దక్కించుకుంది.. 2024లో దాదాపు 1600 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంట్లో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం ఉపయోగించాలని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే అక్కడ ఉన్న జీవరాసులకు ,ప్రకృతికి, పర్యావరణానికి, న్యాచురల్ స్టోన్ ఫార్మేషన్ కి ఎటువంటి హాని కలగజేయకుండా ఐటీ హబ్ క్రియేట్ చేసి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా నిరుద్యోగ సమస్యను అణిచివేయాలి అని, దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తెలంగాణ ప్రభుత్వాన్ని తీసుకెళ్లడానికి సీఎం రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారు.
ఫైనాన్సియల్ డిస్ట్రిక్ దగ్గర లో 400 ఎకరాల స్థలం ఉంటే, విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. పైగా రూ.50 వేల కోట్ల విలువైన ఈ భూమిలో పెట్టుబడి పెట్టడం వల్ల సుమారుగా రూ.15000 కోట్ల వరకు ఆదాయం ప్రభుత్వానికి లభిస్తుంది.. ఈ ఆదాయాన్ని తాను ప్రజలకు.. తెలంగాణ అభివృద్ధికి ఉపయోగిస్తానని సీఎం రేవంత్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సెలబ్రెటీల నుంచి సపొర్ట్ కూడా వస్తుంది. ఇక అందులో భాగంగానే ముఖ్యంగా కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) తోపాటు పలువురు సెలబ్రిటీలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ (Naa Anveshana Anvesh) తో పాటు మరొక యూట్యూబర్ అజయ్ (Ajay Aye Jude) కూడా రంగంలోకి దిగి ప్రజలకు అసలు విషయాన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయాన్ని కొంతమంది తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నా.. వీరు మాత్రం ప్రజలను సరైన రీతిలో ఆలోచించేలా, అసలు ఈ భూ వివాదంలో జరుగుతున్న కుంభకోణం గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కోసం మంచి చేయాలని ఆరాటపడుతున్న తీరు గురించి తన ఫాలోవర్స్ తో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
సీఎం చేసింది కరెక్ట్ అంటున్న నా అన్వేషణ అన్వేష్..
తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసిన అన్వేష్ సిఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఆ 400 ఎకరాల భూమి గురించి క్లారిటీ ఇచ్చారు. ఇక యూట్యూబర్ అన్వేష్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అన్న చేస్తున్నది కరెక్టే. 400 ఎకరాల ద్వారా ప్రజల కోసం రూ.50 వేల కోట్ల సంపదను ఆయన సృష్టిస్తున్నారు. అక్కడ వచ్చేది మొత్తం ప్రజల పైనే పెడతానని కూడా చెబుతున్నారు. ఇలాంటప్పుడు ఎందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ అన్వేష్ తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి పెరుగుతున్న మద్దతు..
అన్వేష్ మాత్రమే కాదు మరొక యూట్యూబర్ అజయ్ కూడా తన ఛానల్ ద్వారా మాట్లాడుతూ.. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? ఎప్పుడు మొదలైంది? ఎవరెవరు దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? అనే విషయాలను కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే యూట్యూబర్ మాట్లాడుతూ.. ఊరి మధ్యలో ఉన్న కంచ గచ్చబౌలి ఏదైతే ఉందో దానిని లీగల్ గా చూసుకుంటే అది గవర్నమెంట్ ల్యాండ్. అయితే దీనిని ఉపయోగించుకుంటే రూ.15000 కోట్ల వరకు మనకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఆ డబ్బుని జనాల మీదే కదా ప్రభుత్వం వాడుతున్నది అని కూడా చెప్పారు. అటు శ్రీధర్ బాబు కూడా అక్కడున్న జీవరాశులకు, పర్యావరణానికి, ప్రకృతికి నాచురల్ రాక్ ఫార్మేషన్ కి ఎటువంటి హాని కలిగించమని స్పష్టం చేశారు.అంతేకాదు అక్కడ ఎకనామిక్స్ బిల్డింగ్ కూడా ఉంది. దానిని కూడా మేము టచ్ చేయము. నేను, ఉప ముఖ్యమంత్రి అక్కడే చదివాము.. ఆ విశ్వాసం మాకుంది.. ఎటువంటి కానీ కలిగించకుండా ఐటీ హబ్ క్రియేట్ చేసే బాధ్యత మాది అని హామీ కూడా ఇచ్చారు. మరి ఇంత హామీ ఇచ్చినప్పుడు కొంతమంది ఎందుకు దీనిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పి ప్రజల కోసం తాను ఉన్నాను అని స్టాండ్ తీసుకొని పోరాడుతున్న అతి కొద్ది మంది నాయకులలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒకరు. అలాంటి నాయకుడికి నేనెప్పుడూ మద్దతు పలుకుతాను అంటే అజయ్ కూడా తెలిపారు.