E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్..!

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్.. ఎయిర్ పోర్టుకు గ్రీన్ సిగ్నల్..!
Advertisement

Sagar Airport: స్వేచ్ఛ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్టు తీరం ఏపీలోని పలనాడు జిల్లా విజయపురి సౌత్ (నల్గొండ జిల్లా సరిహద్దు)లో విమానాశ్రయ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి ప్రపంచ పర్యాటక ప్రాంతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇప్పటికే బహుళార్ధక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ నుంచి అటు విద్యుత్ ఉత్పత్తితో పాటు తెలుగు రాష్ట్రాలకు సాగునీరు అందిస్తూ ఆర్థిక అభివృద్ధికి కీలకంగా ఉంది.

మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ 2.0 లో భాగంగా ఏపీ పరిధిలో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు తీరంలో, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయాలపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన చేయటం.. ఇప్పటికే ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ లను ఎయిర్ పోర్టులుగా మారుస్తున్నట్లు ప్రకటన చేయటం తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభ పరిణామంగా మారనుంది. గతంలో ప్రతిపాదించిన విమానాశ్రయాల ప్రాంతాలలో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అడ్డంకులు ఏర్పడతాయని గుర్తించిన ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( ఏఏఐ) నాగార్జునసాగర్ ప్రాజెక్టు తీరంలో సుమారు 1800 ఎకరాలలో విమానాశ్రయ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రావడం నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏరియా రూపు రేఖలు మారనున్నాయి.

Advertisement

Also Read: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: రాంచందర్ రావు

పెరగనున్న పర్యాటకులు..!

ఏపీలోని పల్నాడు జిల్లా విజయపురి సౌత్ ఏరియాలో పౌర విమానయాన శాఖ ఎయిర్ పోర్ట్ ను నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జునసాగర్ హిల్ కాలనీలో 247 ఎకరాలలో రూ. 100 కోట్లతో నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టు మూడేళ్ల క్రితం ప్రారంభించారు. కాగా ఈ బుద్ధవనం ప్రాజెక్టును శ్రీలంక తో పాటు వివిధ దేశాలకు చెందిన సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ ప్రాజెక్టు శ్రీశైలం వరకు ఆయా అనుకూల పరిస్థితుల అనుగుణంగా లాంచ్ లను నడుపుతుండడం సుమారు 6 గంటల పాటు కృష్ణా నదిలో లాంచ్ లో ప్రయాణించే అనుభవం పర్యాటకుల మరింత ఆకర్షిస్తోంది.

ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Advertisement

తాజాగా విమానాశ్రయం ఏర్పాటు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో పర్యాటకులు పెరగనున్నారు. చారిత్రక నేపథ్యం కలిగి ఉండి అటు తెలంగాణ ఏపీ రాష్ట్రాలకు కనెక్టివిటీ కలిగిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏరియా విమానాశ్రయ ఏర్పాటుతో అన్ని రకాలుగా అభివృద్ధి చెందనుంది. నాగార్జునసాగర్ పరిధిలో 2007లోనే విమానయాన శిక్షణ సంస్థ ఉండగా ప్రస్తుతం విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం ముందడుగు వేయడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మహర్దశ రానుందని తెలుస్తోంది.

Also read: Hospital Controversy: తొర్రూరులో షోకాజ్ నోటీసుల డ్రామా.. భాదితులకు న్యాయం జరిగేనా..?

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×