E-Paper
Advertisement

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!
Advertisement

Samsung AI Glasses: స్మార్ట్‌ఫోన్లు మన చేతిలోకి వచ్చాక ప్రపంచం మొత్తం ఒక్క క్లిక్‌తో మన కళ్ల ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఆ డిస్‌ప్లేను నేరుగా మన కళ్ల ముందే ఉంచేందుకు టెక్ దిగ్గజాలు పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ ఒక అడుగు ముందుకేసి, సమాచారాన్ని నేరుగా చూపేందుకు వీలయ్యేలా ఓ స్మార్ట్ ఏఐ గ్లాసెస్‌ను డిజైన్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం తమ సొంత డిస్‌ప్లే విభాగానికి బాధ్యతలు అప్పగించింది.

ఈ కొత్త స్మార్ట్ గ్లాసెస్ కోసం చాలా చిన్నదైన.. అంటే దాదాపు 0.2 అంగుళాల కంటే తక్కువ పరిమాణం ఉండే మైక్రోడిస్‌ప్లేను తయారు చేయాలని శాంసంగ్ భావిస్తోంది. మన ఫోన్‌కు వచ్చే నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, నావిగేషన్ రూట్ మ్యాప్‌లు, ఐకాన్స్ వంటి ప్రాథమిక వివరాలను కళ్లద్దాల అద్దాలపై ప్రొజెక్ట్ చేయడం ఈ డిస్‌ప్లే ప్రధాన ఉద్దేశం. దీనివల్ల ప్రతి చిన్న విషయానికి జేబులోంచి ఫోన్ బయటకు తీయాల్సిన అవసరం లేకుండానే.. మన పనులు చేసుకుంటూ సమాచారాన్ని చూసుకోవచ్చు.

Advertisement

Also Read: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన శాంసంగ్.. Galaxy S26 సిరీస్‌ ఫోన్లపై రూ.15,000 తగ్గింపు!

ఈ గ్లాసెస్‌ను మరింత మెరుగ్గా రూపొందించడానికి ఒలెడోస్ లేదా లెడోస్ సాంకేతికతలను శాంసంగ్ పరిశీలిస్తోంది. తక్కువ తయారీ ఖర్చుతో పాటు ఎక్కువ నాణ్యత ఇచ్చే వైట్ ఒలెడోస్ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. అలాగే, ఈ కళ్లద్దాలలో డిస్‌ప్లే రెండు కళ్లకు కనిపిస్తుందా లేదా ఒక్క కంటికి మాత్రమే ఉండేలా డిజైన్ చేస్తారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. గ్లాస్ కాంపాక్ట్‌గా ఉంటూనే.. ఎక్కువ భాగంలో సమాచారం కనిపించేలా ఆప్టికల్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడం కంపెనీకి ఒక పెద్ద సవాలుగా మారింది.

Advertisement

ఈ విభాగంలో ఇప్పటికే మెటా సంస్థ తన రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్‌తో మంచి ఆదరణ పొందుతోంది. మెటాకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా.. కస్టమర్లకు ఒక సరికొత్త అనుభూతిని అందించాలని శాంసంగ్ భావిస్తోంది. గతంలో గూగుల్, జెంటిల్ మాన్స్టర్ వంటి బ్రాండ్లతో కలిసి పని చేసిన అనుభవంతో, ఇప్పుడు స్వయంగా డిస్‌ప్లే ఉన్న మోడల్‌ను తీసుకురావడం మార్కెట్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సరికొత్త ఏఐ గ్లాసెస్ మార్కెట్‌లోకి రావడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. మైక్రోడిస్‌ప్లే అభివృద్ధి, నాణ్యతా పరీక్షల ఆధారంగా ఈ ప్రాజెక్ట్ పురోగతి ఉంటుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. 2027 చివరన లేదా 2028 మిడిల్‌లో ఈ అద్భుతమైన గ్లాసెస్ మార్కెట్లోకి మన ముందుకు అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ రకమైన టెక్నాలజీ మన దైనందిన జీవితాన్ని మరింత సులభతరం చేయడం ఖాయం.

Also Read: 6.5 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో రానున్న HMD Key 2.. ధర కూడా తక్కువే!

Tags

Related News

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

ఇలాంటి ల్యాప్ టాప్ ఉంటే..పనులన్నీ క్షణాల్లోనే!

సగం ధరకే బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్..అస్సలు మిస్సవ్వొద్దు

బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లు.. గేమర్స్ ఫిదా అయ్యే ఇయర్‌ బడ్స్!

ఇయర్‌ఫోన్లు వాడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. 60/60 రూల్ పాటిస్తే అంతా సెట్!

6.5 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో రానున్న HMD Key 2.. ధర కూడా తక్కువే!

Big Stories

Advertisement
×