BigTV English

Telangana Assembly Session 2024: తెలంగాణ అసెంబ్లీ సెషన్.. గవర్నర్ ప్రసంగంపై చర్చ!

Telangana Assembly Session 2024:  తెలంగాణ అసెంబ్లీ సెషన్.. గవర్నర్ ప్రసంగంపై చర్చ!
Latest political news in telangana

Telangana assembly live updates: రెండవ రోజు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవ్వగా.. నిన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం పై ధన్యవాదాలు తెలిపై తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి.. తీర్మానాన్ని బలపరిచారు. సింగరేణి కాలరీస్ వార్షిక నివేదిక, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ప్రవేశపెడతారు.


శాసన మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించగా.. బి. మహేష్ కుమార్ గౌడ్ దానిని బలపరుస్తారు. గవర్నర్ తీర్మానంపై సభ్యులంతా చర్చలో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చర్చకు సమాధానమివ్వనున్నారు.

Read More :  మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్.. తప్పంతా వారిదే..


ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ఆర్నెలలో ప్రభుత్వాన్ని పడగొతామని ప్రతిపక్షాలు అంటున్నాయని, పడగొట్టడానికి ఇవేం బిల్డింగులు కావన్నారు. చెప్పు చూపిస్తూ సీఎం గురించి మాట్లాడటం ఎంతవరకూ కరెక్ట్ అని ప్రశ్నించారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు మాట్లాడే భాషపై ఒక చట్టం చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులైనా పూర్తికాకుండానే.. ఇచ్చిన హామీల అమలు ఎందుకు తొందరపాటని ప్రశ్నించారు. దళితజాతిని ఘోరం అవమానించిన చరిత్ర గత ప్రభుత్వానికే ఉందని విమర్శించారు. దళితబంధులోనూ ఎన్నో అవకతవకలున్నాయన్నారు.

అసెంబ్లీకి ఆటోలలో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ధర్నాకు దిగారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడంతో నష్టపోతున్న ఆటోవాలాలకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో నిరసన చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటోవాలాల కుటుంబాలకు రూ.15 లక్షలు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ లో ఆటోవాలాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వద్దకు వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు గేటు ముందే అడ్డుకున్నారు. ఆటోలకు ప్రవేశం లేదని చెప్పడంతో.. ఆటోలు దిగి లోపలికి వెళ్లారు.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×