E-Paper
Advertisement

Nalgonda News: నిజాయితీ చాటుకున్న అంబులెన్స్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన నల్గొండ జిల్లా ఎస్పీ

Nalgonda News: నిజాయితీ చాటుకున్న అంబులెన్స్  సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసిన నల్గొండ జిల్లా ఎస్పీ
Advertisement

Nalgonda News: ఈనెల 9వ తారీఖున గుర్రంపోడు మండలం జూనుతల స్టేజి వద్ద కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న గుర్రంపోడు 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్ లో తీసుకుని వారికి అవసరమైన ప్రథమ చికిత్స చేసుకుంటూ క్షేమంగా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది.

Also Read: Alpha Movie Review: రివేంజ్ స్టోరీగా వచ్చిన ‘Alpha’ ప్రేక్షకులను మెప్పించిందా?.. జేన్యూన్ రివ్యూ..

నిజాయితీగా చాటుకున్న గుర్రంపోడు 108 సిబ్బంది

Advertisement

గాయపడిన క్షతగాత్రుడి వద్దనున్న 1,50,000 రూపాయలను క్షతగాత్రుని యొక్క బంధువులకు అందజేయడం జరిగింది. ఇట్టి విషయంలో నిజాయితీగా చాటుకున్న గుర్రంపోడు 108 సిబ్బంది EMT. సత్యనారాయణ, PILOT. వెంకటేశ్వర్లు లను ఈరోజు అనగా 20.2.2026 శుక్రవారం రోజున నల్గొండ పోలీస్ కేంద్ర కార్యాలయంలో నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ గారు అభినందించి ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది.

పేద ప్రజలకు సేవలు అందించాలి 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక ముందు కూడా ఇలాగే నిజాయితీగా నిస్వార్ధంగా పేద ప్రజలకు సేవలు అందించాలని మరియు అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఇదే విధంగా నిజాయితీగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా 108 ప్రోగ్రాం మేనేజర్ షేక్ సలీం గారు మరియు 108 సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Also Read: ACB Raids: భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ మెరుపు దాడి: ముగ్గురు సిబ్బంది అరెస్ట్

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×