దివాలా చట్టాలపై జాతీయ సదస్సు(National Conclave On Insolvency & Bankruptcy Laws) నిర్వహించేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ సంస్థలు ముందుకొచ్చాయి. బిగ్ టీవీ(BIG TV) భాగస్వామ్యంతో ఈ సదస్సుని ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రిల్ 12, 13 తేదీల్లో నల్సార్ యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ సదస్సు(NCIBL) జరుగుతుంది.
ఈ సదస్సులో పాల్గొనేందుకు వివిధ రంగాల నిపుణులు, ఔత్సాహికులకు నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ సంస్థలు స్వాగతం పలికాయి. విద్యార్ధులు, న్యాయరంగ నిపుణులు, పరిశ్రమలకు చెందిన ఔత్సాహికులు, విద్యాసంస్థలు, బ్యాంకింగ్, ఆర్ధిక రంగానికి చెందినవారెెవరైనా ఈ సదస్సులో పాల్గొనవచ్చు. దివాలా చట్టాలపై తాము రూపొందించిన పేపర్లు సదస్సులో సబ్మిట్ చేయవచ్చు. సదస్సుకు హాజరైనవారు సమర్పించిన పేపర్లను నిపుణులు పరిశీలిస్తారు. వాటిని స్క్రూటినీ చేసి అంతిమ విజేతలకు నగదు బహుమతితోపాటు సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి బిగ్ టీవీ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
ఆన్ లైన్, ఆఫ్ లైన్..
ఏప్రిల్ 12, 13 తేదీల్లో జరిగే ఈ సదస్సుకి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నేరుగా హాజరు కాలేని వారు, ఆన్ లైన్ లో కూడా ఈ సదస్సులో భాగస్వాములు కావొచ్చు. విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఫీజులో రాయితీ కూడా ఉంది. విద్యార్థులు ఆన్ లైన్ లో హాజరు కావాలనుకుంటే 700 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నేరుగా హాజరు కావాలనుకుంటే 2వేల రూపాయలు చెల్లించి తమ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు. విద్యార్థులు కాకుండా మిగతా రంగాలనుంచి హాజరయ్యేవారు ఆన్ లైన్ లో సదస్సులో పాల్గొనాలంటే 1500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. సదస్సులో నేరుగా పాల్గొనాలంటే 4వేల రూపాయలు వారికి రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ణయించారు.
6 థీమ్స్..
ఈ సదస్సులో మొత్తం 6 థీమ్స్ ఉంటాయి.
1. ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ లాస్
2. క్రాస్ బోర్డర్ ఇన్ సాల్వెన్సీ
3. కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ అండ్ లిక్విడేషన్ ప్రాసెస్
4. బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ స్టిట్యూషన్ ఇన్ సాల్వెన్సీ అండ్ రోల్ ఆఫ్ ఆర్క్స్
5. పర్సనల్ ఇన్ సాల్వెన్సీ
6. కార్పొరేట్ గవర్నెన్స్
సదస్సు గురించి మరిన్ని వివరాల కోసం
అక్షత్ మిట్టల్ – 9357496094
ధ్రువ్ గోయల్ – 9910272352
నెంబర్లలో సంప్రదించగలరు.
సదస్సుకి సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ www.bigtvlive.com లో ఎప్పటికప్పుడు మీముందు ఉంచుతాం.