BigTV English

Poisonous Fruits: మీరు తినే ఈ పండ్లు.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనవి, జాగ్రత్త!

Poisonous Fruits: మీరు తినే ఈ పండ్లు.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనవి, జాగ్రత్త!

ప్రకృతిలో అన్నీ మంచివే కాదు, కొన్ని ఆరోగ్యానికి చెడు చేసేవి కూడా లభిస్తాయి. అలాంటి పండ్లు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పండ్ల గురించి ఇక్కడ వివరించాము. ఇది అధికంగా తింటే మరణం సంభవించే అవకాశం ఉంది. ఒరేగాన్ హెల్త్ అండ్ సైన్స్ విద్యాలయంలో న్యూరాలజీ ప్రొఫెసర్ మాట్లాడుతూ సహజంగా పండే పంటలన్నీ మంచివే అనుకోవడం ఒక అపోహని అన్నారు. వాటిలో చెడు పండ్లు కూడా ఉంటాయని వివరించారు.


పాంగ్ పాంగ్
ఆగ్నేయాసియాలో పాంగ్ పాంగ్ అనే చుట్టూ అధికంగా కనిపిస్తుంది. దీనికి కాసే పండ్లు చాలా విషపూరితమైనవి. ఈ చెట్టు విషాలను ఉత్పత్తి చేస్తుంది. ఆగ్నేయాసియా పసిఫిక్ ద్వీపం ఉత్తర ఆస్ట్రేలియాలో ఈ చెట్టు అధికంగా కనిపిస్తుంది. దీనిలో సెర్బెరిన్ అనే విషం దాగి ఉంటుంది. ఎక్కువగా పండ్ల విత్తనాలలోనే ఈ సెర్బెరిన్ అనే విషం ఉంటుంది. ఈ పండ్లను తింటే ఈ సెర్బరిన్ అనే విషం గుండె పైనే నేరుగా దాడి చేస్తుంది. అలాగే పొట్ట రక్త ప్రవాహంలోకి కూడా త్వరగా శోషించుకుంటుంది. కాబట్టి ఈ పాంగ్ పాంగ్ పండు తిన్న అరగంటలోనే వికారం, వాంతులు, విరేచనాలు వంటివి మొదలైపోతాయి. సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకోకపోతే చాలా ప్రమాదం.

మాంచినీల్
మాంచినీల్ చెట్టుకు కాసిన పండు చూడడానికి యాపిల్ లాగా కనిపిస్తుంది. ఆకుపచ్చలో ఉండే ఆపిల్ ను గుర్తుచేస్తుంది కాబట్టి దీన్ని డెత్ యాపిల్ అని పిలుస్తారు. ఈ పండులో ఫోర్బోల్, హిప్పోమైన్ వంటి టాక్సిన్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై తీవ్రమైన కాలిన గాయాలకు కారణమవుతాయి. ఆ గాయాల నుంచి వచే నొప్పిని భరించలేరు. కరేబియన్, మెక్సికో, దక్షిణ అమెరికా, దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లోనే ఈ చెట్లు కనిపిస్తాయి. ఈ పండు నుంచి వచ్చే రసాన్ని తాకడం కూడా ప్రమాదమే. దీన్ని తింటే జీర్ణాశయంతర రుగ్మతలు కలిగి మరణం సంభవించే అవకాశం ఉంటుంది.


చెర్రీ పండ్లు
చెర్రీ పండ్లు చూస్తేనే నోరూరిపోతుంది. మెరిసే రుచిగల ఈ పండ్లు కొన్ని విత్తనాలను కలిగి ఉంటాయి. ఆ విత్తనాలు ప్రమాదకరమైనవి. రీసెర్చ్ గేట్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం చెర్రీ పండులోని విత్తనాలలో హైడ్రోజన్ సైనైడ్ అనే విషపూరిత సమ్మేళనం ఉంటుంది. ప్రమాదవశాత్తు మీరు ఒకటి రెండు విత్తనాలు తింటే ఫర్వాలేదు. కానీ ఎక్కువ మొత్తంలో తింటే మాత్రం గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే మూర్ఛలు వంటి వ్యాధులు కూడా కలగవచ్చు.

స్టార్ ఫ్రూట్
స్టార్ ఫ్రూట్ ప్రపంచవ్యాప్తంగా లభించే ఒక పండు. ఇది జ్యూసీగా ఉంటుంది. పుల్లని రుచులు కలిగి ఉంటుంది. ఆ పండును కోస్తే నక్షత్రం ఆకారంలో కనిపిస్తుంది. అందుకే దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారు. అయితే ఈ స్టార్ ఫ్రూట్ లో కూడా విషం దాగి ఉంటుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెబ్సైట్ చెబుతున్న ప్రకారం స్టార్ ఫ్రూట్ లో అధిక మొత్తంలో ఆక్సలైట్లు ఉంటాయి. ఇవి కాల్షియంతో కలిసి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తాయి. తద్వారా మూత్రపిండాల వైఫల్యానికి కారణం అవుతాయి. కాబట్టి మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారు స్టార్ ఫ్రూట్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

జట్రోఫా
జట్రోఫా అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండే ఉష్ణ మండల పండు. ఇది తీపిగా ఉంటుంది. పసుపు బెర్రీలా కనిపిస్తుంది. ఈ పండు విత్తనంలో రిసిన్ అనే టాక్సిక్ ఆమ్లం ఉంటుంది. ఇది విషపూరితమైనది. ఆ గింజను అనుకోకుండా తింటే వాంతులు ,విరేచనాలు, కడుపునొప్పి, గొంతులో మంట వంటివి వస్తాయి. మనదేశంలో కూడా జట్రోఫా చెట్లు ఉంటాయి. చాలాసార్లు పిల్లలు అనుకోకుండా వీటిని తిని ఆసుపత్రులు పాలైన సంఘటనలు కూడా ఉన్నాయి. బయో డీజిల్ ఉత్పత్తి కోసం ఈ మొక్కలను పెంచుతారు. చత్తీస్ ఘడ్ లోని బిలాస్పూర్ ప్రాంతాల్లో జట్రోఫా చెట్లు కనిపిస్తాయి.

Also Read: తడి జుట్టును దువ్వితే.. జుట్టు రాలిపోతుందా?

లిచీ పండ్లు
లిచీ పండ్లు టేస్టీగా ఉంటాయి. ఒకటి రెండు లిచీ గింజలను తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఈ పండ్లు పూర్తిగా పండిన తర్వాతే తినాలి. పండడానికి కొన్ని రోజులు ముందే తింటే వీటిలో మిథిలీన్ సైక్లోప్రొఫైల్ గ్లైసిన్ అనే విషకారకం ఉంటుంది. ఇది మొదటి వాపుకు కారణం అవుతుంది. బీహార్లో ఎక్కువగా లిచీ పండ్లను తింటారు. బీహార్ లో ఎంతో మంది పిల్లలు లిచీని అధికంగా తిని విషప్రయోగం జరిగి మరణించారు.

Related News

Raw vs Roasted Nuts: పచ్చి గింజలు Vs వేయించిన గింజలు.. ఏవి తింటే మంచిది ?

Junnu Recipe: జున్ను పాలు లేకుండానే జున్ను తయారీ.. సింపుల్‌గా చేయండిలా !

Papaya Seeds: బొప్పాయి సీడ్స్ తింటే.. ఈ వ్యాధులన్నీ పరార్ !

Walking Backwards: రోజూ 10 నిమిషాలు వెనక్కి నడిస్తే.. ఇన్ని లాభాలా ?

Homemade Hair Spray: ఈ హెయిర్ స్ప్రే వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది తెలుసా ?

Ghee With Hot Water: డైలీ మార్నింగ్ గోరు వెచ్చటి నీటిలో నెయ్యి కలిపి తాగితే.. మతిపోయే లాభాలు !

African Swine Fever: ప్రమాదకర రీతిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి.. మరో ముప్పు తప్పదా ?

Healthy Diet Plan: 30 ఏళ్లు దాటితే.. ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి ?

Big Stories

×