BigTV English

Jack Movie Disaster : సినిమా తియ్యడం రాకపోతే దొబ్బేయ్.. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌కు ఊహించని సెగ!

Jack Movie Disaster : సినిమా తియ్యడం రాకపోతే దొబ్బేయ్.. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌కు ఊహించని సెగ!

Siddu Jonnalagadda Fans : టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ తాజాగా ‘జాక్ ‘మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య కథానాయకగా నటించింది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో నేడు రిలీజ్ అయిన ఏ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. స్టోరీ బాగున్న కూడా డైరెక్టర్ ప్రజెంట్ చేయడంలో తడబడినట్టు రివ్యూలు చెప్తున్నాయి. టిల్లు స్క్వేర్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సిద్దుకు ఇది నిరాశను మిగిల్చింది.. ఈ మూవీని చూసిన ఫ్యాన్స్ డైరెక్టర్ ను బండ బూతులు తిడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అసలు ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో ఒకసారి చూసేద్దాం..


డైరెక్టర్ పై సిద్దు ఫ్యాన్స్ బూతులు.. 

సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లు గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం జాక్.. ఈ మూవీ ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ భారీ అంచనాలని క్రియేట్ చేశాయని చెప్పడంలో సందేహం లేదు. అలాంటి సినిమా బాక్సఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టిల్లు స్క్వేర్ తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన సిద్దు జాక్ తో ఫెయిల్ అయ్యాడు. ఈ మూవీని చూసిన ఫ్యాన్స్ డైరెక్టర్ ను దారుణంగా తిడుతున్నారు. అరేయ్ బొమ్మరిల్లు భాస్కర్ నీకు సినిమా తియ్యడం రాకుంటే దొబ్బెయ్.. మూసుకొని కూర్చో.. ఆస్కార్ గెలుచుకొనే మా హీరో తో ఇలాంటి సినిమా తీస్తావా.. నువ్వు దొరికితే చస్తావు అంటూ దారుణంగా మాట్లాడారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..


Also Read: చిన్న పిల్లాడిపై అలాంటి ట్వీటా? వీడు మనిషేనా? అరెస్ట్ చెయ్యాల్సిందే!

జాక్ మూవీ..

జాక్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ తన టిల్లు స్టైల్ డైలాగ్ డెలివరీతో అలరించాడు. యాక్షన్ సీన్స్‌లో ఆకట్టుకున్నప్పటికీ, పాత్రలో ఉన్న సీరియస్‌నెస్ మాత్రం అంతగా కన్విన్స్ చేయలేదు. టిల్లు మార్క్ కనిపించినా, ఇక్కడ కొంచెం తక్కువైంది. వైష్ణవీ చైతన్య డిటెక్టివ్‌గా ఓకే అన్నట్లు చేశారు, ఆమె పాత్రలో ‘బేబీ’ మూవీ ఛాయలు కనిపించాయి. డైలాగ్ డెలివరీ బాగుంది కానీ ఆమెను పూర్తిగా ఉపయోగించుకోలేక పోయారు. డైరెక్టర్ స్టోరీ వీక్ అవ్వడం ఈ మూవీకి మైనస్ అయ్యింది. లాజిక్ మిస్ అవ్వడంతో సినిమా డిజాస్టర్ అయ్యింది. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, సెన్సిబుల్ లవ్‌స్టోరీలకు పేరొందిన ఆయన, ఈసారి ‘జాక్ ‘ ద్వారా స్పై కామెడీ థ్రిల్లర్ అట్టెంప్టెడ్ చేశారు. ఈ సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు చెప్పారు, కానీ ఆ నమ్మకాన్ని స్క్రిప్ట్ పైనా చూపించి ఉంటే మరింత బాగుండేది.  మొదటి రోజే దారుణంగా ఉంటే ఇక రెండు, మూడు రోజులకే థియేటర్ నుంచి అవుట్ అవుతుందేమో చూడాలి.. ఈ మూవీ ఎఫెక్ట్ కొద్ది రోజులు సిద్దు జొన్నలగడ్డ సినిమాలకు బ్రేక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×