Kaleshwaram Project: నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ కాళేశ్వర ప్రాజెక్ట్‌కు సంబంధించి రిపోర్ట్‌ను పంపించింది. ఈ రిపోర్టులో ఇప్పుడు సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌కి గ్రీన్ సిగ్నల్ కూడా రాకముందే బ్యారేజీల నిర్మాణం చేపట్టారని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. కాళేశ్వరం అంశాలపై ఎన్‌డీఎస్‌ఏ నివేదికను రూపొందించి.. రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ..ఫైనల్ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారికి ఎన్‌డీఎస్‌ఏ ఛైర్మన్ అనిల్ జైన్ లేఖ రాశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను స్టడీ చేసిన NDSA టీమ్.. ఫుల్ అండ్ ఫైనల్ రిపోర్టును ఇచ్చింది. బ్యారేజీల నిర్మాణంలో నీటిపారుదలశాఖ ఉల్లంఘనలకు పాల్పడిందని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌లో బ్లాక్-7లో సమస్య చాలా తీవ్రంగా ఉందని రిపోర్ట్ చెబుతోంది. ఇక్కడ స్తంభాలు, రాఫ్ట్ కుంగిపోయాయయని.. బ్యారేజి కింద నేలలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయని తెలిపింది. ఈ రంధ్రాల నుంచి నీరు లీక్ అవుతూ పిల్లర్ కింద ఉన్న నేలను కొట్టుకుపోయేలా చేశాయన్నారు.
సెకంట్ పైల్ కటాఫ్‌ల నిర్మాణంలో నాణ్యత లేకపోవడమే ఈ సమస్యకు కారణమని తేల్చారు. నీరు లీక్ కాకుండా నిరోధించే ఈ కటాఫ్‌లను సరిగా నిర్మించలేదని.. ఈ కటాఫ్‌లలో మరిన్ని రంధ్రాలు ఉండే అవకాశం ఉందని తెలిపింది NDSA రిపోర్ట్ తెలిపింది. భవిష్యత్తులో ఇవి మరింత నష్టం కలిగించవచ్చని కూడా రిపోర్టులో పొందురిచింది NDSA ఎక్స్‌పర్ట్ టీమ్.. తొలి ఏడాదిలో సమస్య తలెత్తినా.. మరమ్మతులలో జాప్యం జరిగిందని వివరించారు. డ్యామ్ సేఫ్టీ చట్టాన్ని పాటించకపోవడంతో సమస్యలు పెరిగినట్టు పేర్కొన్నారు.
మేడిగడ్డ 7వ బ్లాక్ కింద పెద్ద గొయ్యి ఏర్పడటంతో పియర్ దెబ్బతిందని.. సికెంట్ ఫైల్ కటాఫ్స్‌లో క్వాలిటీ లేకపోవడం పియర్ కుంగడానికి కారణమైందని వివరించారు. నాణ్యతాలోపం కారణంగా ఎగువ, దిగువన కటాఫ్ సిస్టమ్ విఫలమైందని స్పష్టం చేశారు.
మేడిగడ్డలోని బ్లాక్‌లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని తెలిపారు. డిజైన్, నిర్మాణం సరిగా లేకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయని వివరించారు. 3 బ్యారేజీలకు సంబంధించి పూర్తిగా పరీక్షలు జరగాలని.. జియో టెక్నికల్, జియో ఫిజికల్ అధ్యయనాలు చేయాలని అన్నారు. హైడ్రాలిక్ మోడల్ స్టడీస్ చేపట్టాలని…అధ్యయనానికి ముందే గ్రౌంటింగ్‌తో అంచనా ఇబ్బందిగా మారిందని వివరించారు.
Also Read: హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 100 కు పైగా దేశ ప్రతినిధులు హాజరు
ఎనర్జీ డిసిపేషన్, నిర్మాణ అంశాలను సరిపడా డిజైన్ చేయలేదని పేర్కొన్నారు. అన్ని బ్యారేజీలకు కటాఫ్ వాల్ అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయని వివరించారు. దీర్ఘకాలిక భద్రత కోసం సమష్టిగా అన్ని విభాగాలు చర్యలు చేపట్టాలని ఎస్‌డీఎస్‌ఏ తన నివేదికలో పేర్కొంది.