Priyanka Jain – Shiv:ప్రియాంక జైన్ (Priyanka Jain).. పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ (Bigg Boss Telugu Season 7)లోకి అడుగుపెట్టి తన స్ట్రాటజీ తో అందరినీ మెప్పించింది. హౌస్ లో గేమ్ లలో సత్తా చాటుతూ టాస్క్ లలో గెలుపొంది, అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ పొట్టి పిల్ల.. గట్టిగానే పోరాడి టాప్ ఫైవ్ లో సింగిల్ లేడీ కంటెస్టెంట్ గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ‘మౌనరాగం’ సీరియల్ లో చేస్తున్నప్పుడే శివకుమార్ (Shiva Kumar) తో ప్రేమలో పడిన ఈ ముద్దుగుమ్మ.. అప్పటినుంచే అతనితో రిలేషన్షిప్ మైంటైన్ చేస్తోంది. అంతేకాదు ఇద్దరూ లివింగ్ రిలేషన్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక తన ప్రియుడు శివకుమార్ తో కలిసి పలు వీడియోలు , రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్నారు.
మా హనీమూన్ నెవర్ ఎండింగ్..
దీనికి తోడు కొన్ని కొన్ని ప్రదేశాలలో వీడియోలు చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. దాంతో క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఇలా లివింగ్ రిలేషన్ తోనే జీవితాన్ని కొనసాగిస్తారా..? లేక పప్పన్నం పెడతారా..? అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వేళ సడన్గా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అభిరుచులను పంచుకోవడమే కాకుండా పెళ్లి గురించి కూడా ప్రస్తావించారు. ఇకపోతే కుటుంబ సభ్యుల పర్మిషన్ తోనే సహజీవనం చేస్తున్నట్టు ప్రియాంక జైన్ ,శివకుమార్ తెలిపారు. మీ హద్దులు ఏంటో మీకు తెలుసు కాబట్టి కలిసి ఉండమని మా పేరెంట్స్ చెప్పారు. అందుకే సహజీవనం చేస్తున్నాము. పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారు. ఇలాంటి పద్ధతులు మన సమాజానికి సిగ్గుచేటు కదా అని చాలామంది అంటున్నారు కానీ ఆ మాటలన్నింటికీ త్వరలోనే చెక్ పెడతాము అంటూ తెలిపారు ఈ జంట..
ఈ ఏడాదే మా పెళ్లి అంటున్న ప్రియాంక – శివ్..
పెళ్లెప్పుడు చేసుకుంటారని అభిమానులు తెగ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాస్తవానికి గత ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. “మాకు పెళ్లి కాలేదు కానీ ప్రియాంక నా భార్య.. దేవుడి దయతో 2024 లోనే పప్పన్నం పెట్టాలని అనుకుంటున్నాము. ఈ ఏడాది లోపే మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము. ఒకవేళ కుదరకపోతే కచ్చితంగా 2025లో మా పెళ్లి జరుగుతుంది. ఇది పక్కా.. మా హనీమూన్ కూడా గుర్తుండిపోయేలా చేసుకుంటాము. ప్రియాంకను ప్రతి ఒక్క దేశం తీసుకొని వెళ్లి హనుమాన్ చేసుకుంటా.. మాది నెవర్ ఎండింగ్ హనీమూన్ అంటూ శివకుమార్ నాడు కామెంట్లు చేయగా.. ఇప్పుడు మళ్ళీ అవే మాటలు వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటామని చెబుతున్నారు. కానీ వీరి మాటలు విన్న నెటిజన్స్ మాత్రం ప్రియాంక , శివకుమార్ పెళ్లి చేసుకుంటారట..? నిజమేనా..? లేక ఉత్తిత్తిగానే.. ఎప్పటిలాగే చెప్పి తప్పించుకుంటారా.. ? అంటూ కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనా ఈ ఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని చెబుతూ అన్ని ప్రశ్నలకు పులిస్టాప్ పెడతామని చెబుతున్న ఈ జంట మరి ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందో చూడాలి.