E-Paper
Advertisement

Railway Dispute: పునర్వి విభజన చట్టానికి తూట్లు.. ఓరుగల్లులో రైల్వే ఖజానాకు భారీగా గండి..!

Railway Dispute: పునర్వి విభజన చట్టానికి తూట్లు.. ఓరుగల్లులో రైల్వే ఖజానాకు భారీగా గండి..!
Advertisement

Railway Dispute: స్వేచ్ఛ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం.. రైల్వే పరిపాలనలో కొన్ని మార్పులు జరిగాయి. ప్రాంతీయ సమతుల్యత, పరిపాలనా సమర్థత, మరియు సేఫ్టీ ప్రమాణాలను దృష్టి లో పెట్టుకుని ఉమ్మడి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ను సౌత్ సెంట్రల్ రైల్వే(ఎస్ సీఆర్), సౌత్ కోస్ట్ రైల్వే(ఎస్ సీఓఆర్)గా విభజించారు. ఇది ఆంధ్రప్రదేశ్-తెలంగాణ ప్రాంతాల ప్రాతిపదికన సమన్యాయం సాధించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. అయితే, ఈ పునర్విభజన చట్టం స్ఫూర్తికి విరుద్ధమైన అంశంగా గుణదల(గాలా) క్రూ లాబీ వివాదంగా మారింది.

సౌత్ సెంట్రల్ రైల్వేలో..

గుణదల క్రూ లాబీ భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉండి, ప్రస్తుతం సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలోకి వెళ్లినప్పటికీ, అక్కడ పనిచేస్తున్న సికింద్రాబాద్ డివిజన్ సిబ్బంది( కొంత మంది విజయవాడ స్థానిక సిబ్బంది మాత్రమే) తమను అక్కడే ఉంచి సౌత్ సెంట్రల్ రైల్వేలో కొనసాగించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ డిమాండే.. పరిస్థితిని సంక్లిష్టంగా మారుస్తోందని పలువురు చెబుతున్నారు. ఈ సమస్యను కేవలం ఉద్యోగుల స్థానిక సౌకర్యం కోణంలో చూడటం సరిపోదని వాపోతున్నారు. రైల్వే వ్యవస్థలో ప్రతి సిబ్బంది ఒక నిర్దిష్ట జోన్, డివిజన్‌కు పరిపాలనా పరంగా అనుసంధానం కావడం అనివార్యం. ఒక డివిజన్-ఒక పరిపాలన అనే సూత్రం రైల్వే ఆపరేషన్లలో ప్రధానమైనదిగా ఉంది.

క్రూ లాబీ కేంద్రం పేరుకే..

Advertisement

ప్రస్తుత పరిస్థితిలో.. సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన సిబ్బంది సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలో పనిచేయడం వల్ల పరిపాలనా గందరగోళం తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో కమాండ్, కంట్రోల్ రెండూ ఉండవనే వాదన బలంగా వినిపిస్తోంది. సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగుల మెడికల్, ఇతరత్రా అవసరాలు కూడా క్లిష్టం గా మారే ప్రమాదముందని చెబుతున్నారు. క్రూ లాబీ కేంద్రం పేరుకే గుణదలలో ఉన్నా.. సిబ్బంది నిర్వహణ మొత్తం విజయవాడ కేంద్రంగానే జరుగుతోంది. ఉద్యోగులకు చెల్లించే అలవెన్సులు సైతం.., విజయవాడ లెక్కలోనే చెల్లిస్తున్నారు. దీనివల్ల రైల్వే ఖజానాకు నెలకు రూ.కోట్లలో నష్టం వాటిల్లుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లకు సంబంధించిన విశ్రాంతి నియమాలు, డ్యూటీ సమయ నియంత్రణలు, ఫాటిగ్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు విఘాతం చెందే ప్రమాదం ఉందని పలువురు చెబుతున్నారు. ఇది నేరుగా రైల్వే సేఫ్టీపై ప్రభావం చూపే అంశమని వాపోతున్నారు. ఇటీవల గాలా జేఏసీ విడుదల చేసిన లేఖలో వర్కింగ్ సిస్టమ్ ను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Indore Infosys Techie Killed: పార్కింగ్ ఏరియాలో కారుతో గుద్ది.. మహిళా టెక్కి ప్రాణాలు తీసిన ఉన్మాది!

జోన్ పునర్విభజన తర్వాత

Advertisement

మరోవైపు, ఈ పరిస్థితి ప్రాంతీయ అసమానతను మరింత పెంచే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో కాజీపేట జంక్షన్ వంటి కీలక రైల్వే కేంద్రం ఉన్నప్పటికీ, కొంత మంది స్వార్థ పూరిత ఆలోచనల వల్ల ఇప్పటికే అనేక క్రూ లింక్ లను గాలా డిపోకు కేటాయించడంపై దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. విజయవాడ నుంచి బల్లార్షా వరకు దాదాపు 450 కిలోమీటర్ల దూరాన్ని.. గాలా డిపో క్రూ పనిచేయడం సేఫ్టీ విషయంలో ఆందోళన కలిగించే అంశమని చెబుతున్నారు. జోన్ పునర్విభజన తర్వాత గాలా డిపో పూర్తిగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధికి 60 కిలోమీటర్ల దూరానికి వెళ్లిపోయిందని చెబుతున్నారు. అయితే ఎప్పటి నుంచో ఉన్న వరంగల్ సెంట్రలైజ్డ్ లాబీ డిమాండ్ కు అనుగుణంగా.. ట్రేడ్ యూనియన్లు, ఇతర సంఘాల మద్దతును కూడగట్టడంలో కాజీపేట రైల్వే జేఏసీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల గాలా జేఏసీ నాయకులు రైల్వే అధికారులకు రాసిన ఓ లేఖ తీవ్ర వివాదానికి దారి తీసింది. వరంగల్ లో మౌలిక సదుపాయాల కొరత వల్ల అక్కడ సెంట్రలైజ్డ్ క్రూ లాబీ ఏర్పాటు అనవసరం అనేది ఆ లేఖ సారాంశంగా ఉండటంతో వరంగల్ పై వారికున్న అక్కసు తేటతెల్లం చస్తోందని యూనియన్ నాయకులు పలువురు ఆగ్రహంగా ఉన్నారు.

ఉద్యోగుల నుంచి డిమాండ్లు

తెలంగాణలోనే రెండో అతిపెద్ద నగరం వరంగల్. అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్న వరంగల్ పై.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొంత మంది నాయకుల ప్రోద్బలంతోనే ఈ తరహా అక్కసు వెళ్లగక్కారని తెలంగాణకు చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే యూనియన్ నాయకులు, ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇది పునర్విభజన లక్ష్యాలకు తూట్లు పొడిచే చర్యగా ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుణదల లాబీని పూర్తిగా సౌత్ కోస్ట్ రైల్వే(ఎస్ సీఓఆర్) పరిధిలోకి మార్చి సౌత్ సెంట్రల్ రైల్వే(ఎస్ సీఆర్) సిబ్బందిని తమ జోన్‌కు పునర్వ్యవస్థీకరించడం ద్వారా శాశ్వత పరిష్కారం చూపించవచ్చని చెబుతున్నారు. అదే సమయంలో, వరంగల్ లో సెంట్రలైజ్డ్ క్రూ లాబీ ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంతీయ సమతుల్యతను సాధించవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించి ఫుల్ స్టాప్ పెట్టాలని సౌత్ సెంట్రల్ రైల్వే యూనియన్ నాయకులు, ఉద్యోగల నుంచి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అంశంపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిందే.

Also Read: Cabinet Expansion: ఆశల పల్లకిలో విహరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలు.. అందరి చూపు చినబాబు పైనే..?

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×