BigTV English

Negligence of the Authorities: అధికారులూ నిర్లక్ష్యం వీడండి!

Negligence of the Authorities: అధికారులూ నిర్లక్ష్యం వీడండి!

– వ్యవసాయ శాఖ అధికారుల అశ్రద్ధ
– రైతు కమిషన్‌కు సౌకర్యాల లేమి
– ఓవైపు రైతు సంక్షేమం కోసం ప్రభుత్వ చర్యలు
– ఇంకోవైపు అధికారుల నిర్లక్ష్యపు నీడలు
– ఇప్పటికైనా మారతారా?


స్వేచ్ఛ క్వశ్చన్ బ్యూరో: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. జీవో నెంబర్ 36తో దీన్ని ఏర్పాటు చేసి, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండ రెడ్డిని చైర్మన్‌గా నియమించింది. భూ చట్టాల నిపుణుడు సునీల్‌తో సహా మరో ఆరుగురు సభ్యులుగా ఈ కమిషన్ ముందుకెళ్తోంది. మొదటి సమావేశం ఈమధ్యే నవంబర్ 2న బూర్గుల రామకృష్ణారావు(బీఆర్‌కే) భవన్‌లో జరిగింది. అయితే, కమిషన్‌కు సంబంధించి అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. విద్యా కమిషన్‌కు వసతులు ఆగమేఘాలపై ఏర్పాటు కాగా, రైతు కమిషన్‌పై మాత్రం అశ్రద్ధ వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఇబ్బంది పడుతున్న చైర్మన్, సభ్యులు.. అంతా వారి వల్లే!


బీఆర్‌కే భవన్‌లో కమిషన్ ఏర్పాటైంది కానీ, సరైన సౌకర్యాలు చేయలేదు సంబంధిత అధికారులు. కనీస వసతులు, కావాల్సిన సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు సభ్యులు. చాంబర్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం చైర్మన్ కోదండ రెడ్డి కోసం ఒక చాంబర్ ఏర్పాటు చేయగా, అందులో వాష్ రూమ్‌కు డోర్ లేని పరిస్థితి. ఎవరైనా వాష్ రూమ్‌కు వెళ్లాలంటే మరొకరు దగ్గరలో నిలబడాల్సి వస్తోంది. వచ్చిన గెస్టులు దీన్ని చూసి షాక్ అవుతున్నారు. ఈ పరిస్థితి చూసి బాధ్యతలు తీసుకోడానికి సభ్యులు వెనుకాడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది.

Also Read: ధరణి మాటున దగా.. వందల ఎకరాల ప్రభుత్వ భూములకే ఎసరు

చాంబర్లు లేక చైర్మన్‌ రూమ్‌లోనే!

బాధ్యతలు తీసుకున్న మెంబర్లు చాంబర్ల లేక చైర్మన్ రూమ్‌లోనే కూర్చుంటున్నారు. ఈ పరిస్థితి చూసి రాములు నాయక్ తనకు పదవి వద్దని అంటున్నట్టు సమాచారం. ఓవరాల్‌గా ఈ వ్యవహారం చూశాక, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తే, కిందిస్థాయిలో అధికారులు నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్‌కు కమిషన్ ఏర్పాటు ఇష్టం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే, కమిషన్ ఏర్పాటుపై జీవో ఇవ్వడానికి ఈయన మొదట్లో ఆలస్యం చేశారని అనుకుంటున్నారు.

పెత్తనంగా భావిస్తున్న అధికారులు.. బాధ్యతగా భావించలేరా?

రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటోంది ప్రజా ప్రభుత్వం. ఇప్పటికే రుణమాఫీ అందించి ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. వారి అవసరాల కోసం ప్రభుత్వం రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తే, అధికారులు మాత్రం దీన్ని పెత్తనంగా భావిస్తున్నారు. అందుకే, పైసా కూడా వ్యవసాయ శాఖ నుండి విడుదల కావడం లేదట. దీంతో సొంత ఖర్చులతోనే టీ, స్నాక్స్ తెప్పించుకుంటున్నారు సభ్యులు. అంతేకాదు, సొంత మనుషులనే సిబ్బందిగా వాడుకుంటున్నారట. ఈ ఇష్యూని సీఎం దృష్టికి తీసుకెళ్లే పనిలో కమిషన్ చైర్మన్, సభ్యులు ఉన్నారు.

రైతు కమిషన్‌పై సీఎం రేంత్ రెడ్డి ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారు. రైతుల పట్ల ఉన్న ప్రేమతో దీన్ని ఏర్పాటు చేశారు. కానీ, వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వారిలో మార్పు రావాలి.

Related News

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన

Konda Surekha vs Ponguleti: ఢిల్లీకి చేరిన పంచాయితీ.. పొంగులేటిపై సోనియాకు కొండా కంప్లైంట్

Big Stories

×