Anushka shetty: తెలుగు ఇండస్ట్రీ జేజేమ్మ అంటే అనుష్క( Anushka )పేరే వినిపిస్తుంది.. ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాల్లో నటించినా కూడా అరుంధతి రికార్డులు బ్రేక్ చెయ్యలేక పోయింది. ఈ సినిమా అనుష్క కేరీర్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన బాహుబలి సిరీస్ మూవీస్, భాగమతి వంటి సినిమాలు ఆమెకు మంచి హిట్ టాక్ ను అందించాయి. అయితే ఒకప్పుడు చాలేంజింగ్ రోల్స్ చేస్తున్న అనుష్క ఈ మధ్య అడపా దడపా సినిమాలతో సరిపెట్టుకుంది. ఈ మధ్య సినిమాలు తక్కువగా చేస్తుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటివరకు మనం ఆమె నటించిన బ్లాక్ హిట్ సినిమాలను చూసాము.. కానీ ఇప్పుడు ఆమె రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవో? ఎందుకు రిజక్ట్ చేసిందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
అనుష్క బాహుబలి చేసిన తర్వాత ఓ బాలీవుడ్ ఆఫర్‌ను ఆమె తిరస్కరించింది. అది.. కరణ్ జోహార్ లాంటి బిగ్ ప్రొడ్యూసర్ ఇచ్చిన ఆఫర్ కావడం గమనార్హం. తాను తీస్తున్న ఓ సినిమా కోసం అనుష్కను కరణ్ సంప్రదించాడనీ, అయితే అతను ఆఫర్ చేసిన రోల్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆమె తప్పుకుందని టాక్.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత మణిరత్నం లేటెస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘పొన్నియన్ సెల్వన్’ కూడా ఉంది. మాగ్నమ్ ఓపస్‌గా తయారవుతున్న ఈ మూవీలో జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్యా రాయ్, ప్రభు, జయరామ్ లాంటి పేరు పొందిన నటులు ఉన్నారు.. ఈ సినిమాకు త్రిష ప్లేసులో ముందుగా అనుష్క ను అడిగారట కానీ ఆమె రిజెక్ట్ చేసిందట..
అలాగే రజనీకాంత్ హీరోగా ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన ‘కొచ్చాడయాన్’ మూవీలో హీరోయిన్‌గా దీపికా పడుకోనే నటించింది. ఈ మూవీలో ముందుగా అనుష్కను సంప్రదించారట.. ఆమె బిజీగా ఉండటం వల్ల నో చెప్పిందట.. ఆ సినిమా కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
తమిళ స్టార్ హీరో ధనుష్ అసురన్’కు తెలుగు రీమేక్ అయిన ‘నారప్ప’లో వెంకటేశ్ భార్య పాత్రకు మొదట శ్రియా శరణ్‌ను అనుకున్నారు. ఆ తర్వాత అనుష్కను సంప్రదించారు. అప్పుడు ‘నిశ్శబ్దం’ సినిమా చేస్తుండటంతో ఆ మూవీని వదిలేసుకుంది. ఆ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది..
అనుష్క నటించిన సినిమాల కన్నా కూడా రిజెక్ట్ చేసిన సినిమాలే మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.
ఇక అనుష్క సినిమాల విషయానికొస్తే.. బాహుబలి 2 విడుదలయిన తర్వాత తను కేవలం మూడు సినిమాల్లో మాత్రమే కనిపించింది. అందులో రెండు సూపర్ హిట్ అయినా కూడా వెంటవెంటనే సినిమాలు చేయడానికి అనుష్క అంతగా ఆసక్తి చూపించడం లేదనే టాక్ వినిపించింది. క్రిష్ దర్శకత్వంలో అనుష్క (Anushka) నటిస్తున్న చిత్రమే ‘ఘాటీ’ (Ghaati). ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ బయటికొచ్చింది.. ఈ మూవీ నుంచి ఈరోజు మరో అప్డేట్ రానుందని సమాచారం..