trinayani serial today Episode: వాటర్ కోసం త్రినేత్రి వాళ్ళ ఇంట్లోకి వచ్చిన విశాల్‌ను చూసి అందరూ పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి అనుకుని గౌరవ మర్యాదలు చేస్తుంటారు. విశాల్ షాకింగ్ నేను అడగకుండానే మంచి నీళ్లు తీసుకొచ్చారని థాంక్స్ చెప్తాడు విశాల్. దీంతో వైకుంఠం మర్యాదలు చేయాలి కదా బాబు అంటుంది. ఇంతలో విశాల్ నేను వాటర్ తాగి వెళదామనుకుంటున్నాను అంటాడు. దీంతో నా మనవరాలి చేతి కాఫీ తాగాకా బయలుదేరుదులే బాబు అంటుంది బామ్మ. వైకుంఠాన్ని లోపలికి వెళ్లి త్రినేత్రిని తీసుకురమ్మని చెప్తుంది. సరేనని లోపలికి వెళ్తుంది వైకుంఠం.
కారు బ్రేకులు లూజు చేసిన వల్లభ అందరూ రాగానే కంగారుపడుతుంటాడు. పెద్దల్లుడు, తిలొత్తమ్మ అక్కయ్య కారు దగ్గర రెడీగా ఉన్నారని పావణమూర్తి చెప్పగానే వాళ్లు పోవడానికి కాదులే మామయ్యా అని విక్రాంత్ చెప్తాడు. దీంతో వల్లభ ఏయ్ మేము పోవడానికి ఇంకా చాలా టైం ఉంది అంటాడు. దీంతో విక్రాంత్ నేను అన్నదేంటి..? నువ్వు చెప్తున్నదేంటి అని డౌటుగా అడుగుతాడు. ఇంతలో తిలొత్తమ్మ తింగరోడు వాడు సంబంధం లేకుండా మాట్లాడతాడని సర్ది చెప్తుంది. ఇంతలో సుమన లింక్ ఉంది అత్తయ్యా మా అక్క ప్రాణాలకు అంటుంది. దీంతో వల్లభ మరింత కంగారుగా తెలిసిపోయిందా..? నీకు అని అడుగుతాడు. దీంతో వీడి వల్ల నేను కూడా దొరికపోయేలా ఉన్నాను అని మనసులో అనుకున్న తిలొత్తమ్మ వల్లభను తిడుతుంది. ఇంతలో నయని, హాసిని వస్తుంటారు. వాళ్లను చూసిన పావణమూర్తి నయని అమ్మా ఆ చీరలో ఎంత అందంగా ఉందో అంటాడు.
మరోవైపు విశాల్ కు కాపీ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది త్రినేత్రి. కాఫీ కోసం వెయిట్ చేస్తున్న విశాల్ దగ్గరకు కాఫీ తీసుకుని వచ్చి మీ పేరేంటని మా మేనకోడలు అడుగుతుంది అని వైకుంఠం చెప్పగానే తన పేరు చెప్తాడు. విశాల్. ఇంతలో విశాల్ కాఫీ తాగగానే లోపలి నుంచి త్రినేత్రి తన చేతి కాఫీ ఎలా ఉందో అడగమని సైగ చేస్తుంది. బామ్మ కాఫీ ఎలా ఉందని అడుగుతుంది. చాలా బాగుందని విశాల్ చెప్పగానే త్రినేత్రి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో విశాల్ వెళ్లబోతుంటే మిగతా వివరాలు ఎప్పుడు మాట్లాడుకుందామని బామ్మ అడుగుతుంది. వచ్చే వారం మళ్లీ వస్తానని అప్పుడు మాట్లాడుకుందామని చెప్పి వెళ్లిపోతాడు విశాల్.
హాసిని, నయని వస్తుంటే వాళ్లను చూసిన సుమన ఏంటి మా అక్కను పెళ్లి చూపులకు తీసుకెళ్తున్న అమ్మాయిలా తీసుకొస్తున్నావని అడుగుతుంది. అవునని నయని ఈ చీర కట్టుకుంటుంటే 5 ఏండ్లు వయసు తగ్గిపోయినట్టు కనిపిస్తుందని చెప్తుంది. ఇంతలో నయని కారులో కూర్చోగానే డ్రైవర్ వచ్చి కారు తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత విక్రాంత్ ఏదో ఆలోచిస్తుంటే.. వల్లభ, తిలొత్తమ్మ వస్తారు. ఏరా మా లాగే నువ్వు కూడా ఆలోచిస్తున్నావా? అని అడుగుతాడు వల్లభ. దీంతో మీరేం ఆలోచిస్తున్నారు బ్రో అని ఎదురు అడుగుతాడు విశాల్.
మేము ఏం చేయాలా అని ఆలోచిస్తుంటాము అని వల్లభ చెప్పగానే వీడు నా పరువు తీయడానికే పుట్టినట్టు ఉన్నాడు అని తిలొత్తమ్మ తిడుతుంది. ఇంతలో హారతి తీసుకుని వచ్చిన హాసిని కూడా పని పాట లేని వాళ్లు పిట్టకథలు అయినా చెప్పాలి. పిల్లలకు బాగుంటుంది కదా? అంటుంది. దీంతో వల్లభ ఏయ్ ఎప్పుడంటే అప్పుడు పూజలు చేస్తావేంటి నువ్వు అని వల్లభ అడుగుతాడు. మీకు పుణ్యం బాగా రావాలని చేస్తుందోమో అని సుమన అంటూ కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు అంటుంది. దీంతో హారతి ఇస్తే కష్టాలు ఎందుకు వస్తాయి చిట్టి అని అడుగుతుంది హాసిని.
ఇంతలో నా అంచనా ప్రకారం ప్రాణ గండం పరుగున నయని దగ్గరకు వస్తుందేమో అంటుంది. దీంతో విక్రాంత్ ఎందుకమ్మా అలా మాట్లాడతావు శుభం పలకొచ్చు కదా? అంటే వల్లభ శుభమా.. అంటూ వెటకారంగా మాట్లాడతాడు. దీంతో హాసిని వల్లభను తిడుతూ నయనికి వచ్చిన ఆపదను మనం ఎలాగూ తప్పించలేము కానీ ఇలా మాట్లాడటం సరికాదని చెప్తుంది. దీంతో అందరి మధ్య గొడవ జరుగుతుంది. గొడవలో విక్రాంత్.. కోపంగా వల్లభను తోసేస్తాడు.
దీంతో తిలొత్తమ్మ కోపంగా విక్రాంత్ ను కొడుతుంది. దీంతో సుమన ఏడుస్తూ ఆవిడ గారు గడప దాటి మనలో మనం కొట్టుకునేలా చేసింది చూశారా..? అంటూ వెళ్లిపోతుంది. దేవీపురం ఆలయానికి విశాల్ వెళ్తుంటాడు. అదే ఆలయానికి నయని వెళ్తుంది. విశాల్ ను మళ్లీ చూడాలని త్రినేత్రి బయటకు వెళ్తుంది. త్రినేత్రిని చంపమని కిరాయి రౌడీకి సుపారీ ఇస్తాడు ముక్కోటి. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.