E-Paper
Advertisement

అయోధ్య హుండీ లెక్కింపు సిబ్బంది రాజీనామా.. వెలుగులోకి సంచలన విషయాలు!

అయోధ్య హుండీ లెక్కింపు సిబ్బంది రాజీనామా.. వెలుగులోకి సంచలన విషయాలు!
Advertisement

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. మొక్కులు తీర్చుకుని హుండీలో భారీగా విరాళాలు సమర్పిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ విరాళాల లెక్కింపే వివాదంగా మారింది. విరాళాల దుర్వినియోగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

వరుసగా ఉద్యోగాలకు రాజీనామా..

Advertisement

దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే.. హుండీ లెక్కించే సిబ్బంది వరుసగా ఉద్యోగాలకు రాజీనామా చేయడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఉద్యోగాలు వదిలేయడంతో అసలు అక్కడ ఏం జరుగుతోందనే చర్చ మొదలైంది. ఒకప్పుడు హుండీ లెక్కింపులో దాదాపు 40 మంది ఉద్యోగులు పనిచేసేవారు. కానీ ఇప్పుడు కేవలం 12 మంది మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. 20 మందికిపైగా సిబ్బంది రాజీనామా చేయడంతో లెక్కింపు ప్రక్రియ కూడా నెమ్మదించింది.

Also Read: వియత్నాం బోటు ప్రమాదంలో ఏపీ పర్యాటకులు.. రంగంలోకి దిగిన నారా లోకేష్!

Advertisement

ఉద్యోగాలు వదిలారా..? దర్యాప్తుకు భయపడ్డారా..?

విరాళాల స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. హుండీ లెక్కింపు కేంద్రంలోకి వెళ్లే ప్రతి ఉద్యోగిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. భద్రతా నిబంధనలు కఠినతరం అయిన తర్వాతే ఇంతమంది ఉద్యోగులు రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీళ్లు ఎందుకు ఉద్యోగాలు వదిలారు..? దర్యాప్తుకు భయపడ్డారా..? లేక మరో కారణం ఉందా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఈ నెల 13న సమగ్ర విచారణ

మరోవైపు ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లింది. విరాళాల వ్యవహారంపై స్వతంత్రంగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఈ నెల 13న విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది..? విరాళాల వ్యవహారంపై ఉన్న అనుమానాలకు తెరపడుతుందా..? లేక మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయా..? అన్నది ఆసక్తిగా మారింది.

Also Read: స్కూల్ బస్సులకు పసుపు రంగే ఎందుకు? దీని వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా?

Related News

లక్నో మర్డర్ మిస్టరీ.. మోడల్ శ్రద్ధా దూబే హత్య కేసులో పూర్తి వివరాలివే?

ఓట్ల చోరీకి మోదీ సూత్రధారి.. అమిత్ షా పాత్రధారి: విపక్ష కూటమి నేతలు ఫైర్!

తెలంగాణ ఉన్నత విద్యకు మరణశాసనంగా మారిన జీవో.. బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్‌లో సంచలనం?

విశాఖ మేయర్ రేసులో ఉన్న మొత్తం లీడర్స్ వీళ్లే.. ఇదిగో ఫుల్ లిస్ట్?

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో ఫేక్ లెక్చరర్..?

Big Stories

Advertisement
×