BigTV English

TRS: తెలంగాణలో మరో TRS పార్టీ.. BRSకి బిగ్ షాక్ తప్పదా?

TRS: తెలంగాణలో మరో TRS పార్టీ.. BRSకి బిగ్ షాక్ తప్పదా?

TRS: టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారింది. దేశవ్యాప్తమైంది. పార్టీ పేరులోంచి తెలంగాణను తీసేయడంపై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఆత్మ లేదని.. ఇక బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ కాదని ఆరోపించాయి. పేరు మారినా తెలంగాణ డీఎన్ఏ మారలేదంటూ.. గులాబీ నేతలు ప్రజలకు బాగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. పేరులో ఏముంది అని తీసిపారేయకుండా.. ఆ పేరుతోనే రాజకీయాలపై పట్టు సాధించవచ్చని భావిస్తున్నారో ఓ బీఆర్ఎస్ మాజీ నేత. తనను లైట్ తీసుకున్న పార్టీకి.. ఆ పార్టీ పేరుతోనే దెబ్బ కొట్టాలనే బిగ్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. అంగబలం, ఆర్థిక బలం మెండుగా ఉన్న నేత కావడంతో.. ఆయన అనుకుంటే కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు చుక్కలు చూపించే ఛాన్సెస్ ఎక్కువే అంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే….


మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలుసుగా. తనకు ప్రాధాన్యం లేదనే కారణంతో ఇటీవలే బీఆర్ఎస్‌ను వీడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అనుచర వర్గాన్ని పోగేస్తున్నారు. కేసీఆర్, బీఆర్ఎస్‌పై విమర్శలు, సవాళ్లు చేస్తున్నారు. అయితే, ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగింది. త్వరలో.. త్వరలో అంటూ వారాల తరబడి కథనాలు వచ్చాయి. ప్రస్తుతం బీజేపీలో చేరేది లేనట్టే అనిపిస్తోంది. కాంగ్రెస్‌లోకి వెళతారని కూడా అన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఓపెన్‌గానే ఆఫర్ ఇచ్చారు. అయినా, హస్తానికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఆ తర్వాత షర్మిలతో భేటీ అయ్యారు. వైఎస్సార్‌టీపీ నుంచి పోటీ చేస్తారని.. ఆ మేరకు పొంగులేటి హామీ ఇచ్చారని షర్మిల, విజయమ్మలు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆసక్తి రేపాయి. వాటినీ ఆయన ఖండించారు. ఇంతకీ పొంగిలేటి దారెటు?

లేటెస్ట్‌గా మరో టాక్ వినిపిస్తోంది. ఆ పార్టీ, ఈ పార్టీలో చేరేదేంటి? తనకున్న అంగ, అర్థ బలంతో తానే ఓ కొత్త పార్టీ పెట్టుకుంటే పోలా.. అని పొంగిలేటి భావిస్తున్నారట. త్వరలోనే ‘తెలంగాణ రైతు సమితి’-TRS పేరుతో కొత్త పార్టీ పెట్టబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పాత పేరైన టీఆర్ఎస్ వచ్చేలా పార్టీ పేరు పెట్టాలనుకోవడం పొలిటికల్‌గా ఇంట్రెస్టింగ్ పాయింట్.


ఈ విషయం తెలిసి.. పొంగులేటితో మరికొంత మంది కీలక నేతలు టచ్ లోకి వచ్చేశారని అంటున్నారు. కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఓ ఇద్దరు బడా నాయకులు.. పొంగులేటితో చేతులు కలిపి.. టీఆర్ఎస్ పార్టీతో తెరమీదకు రావాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం.

టీఆర్ఎస్ పెట్టినా పెట్టేస్తారు పొంగులేటి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గట్టి పట్టు ఉంది ఆయనకి. అనుచరగణమూ ఘనమే. తనకున్న ఆర్థిక బలంతో ఖమ్మం పక్కనే ఉన్న వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ కాస్తో కూస్తో ప్రభావం చూపగలరు. ఇక, టీఆర్ఎస్ పేరు ఎలానూ కలిసొస్తుంది. కాస్త కష్టపడి ఏ పదో, పాతికో సీట్లు గెలుచుకుంటే.. ప్రభుత్వ ఏర్పాటులో తానే కింగ్ పిన్‌గా మారొచ్చనేది ఆయన ఆలోచనలా కనిపిస్తోంది. ఇక కరీంనగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన మరో ఇద్దరు నేతలు సైతం ఆయా ప్రాంతాల్లో బాగా బలమున్న నాయకులే కావడంతో.. ఆ ముగ్గురు కలిసి 30 సీట్లు ఈజీగా గెలిచేయొచ్చనేది వారి లెక్కగా కనిపిస్తోంది.

బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుండటం.. ఈసారి ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవచ్చని అంటుండటం.. హంగ్ తప్పదని సర్వేలు చెబుతుండటం.. ఇలా రాజకీయ తరాజులో.. తాము రారాజులుగా ఎదగొచ్చనేది ఆ ముగ్గురి అంచనా. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే.. తానే తనకు కావాల్సిన పదవులు డిమాండ్ చేసి మరీ తీసుకోవచ్చని భావిస్తున్నారు పొంగులేటి. అందుకే, ఏదో ఒక పార్టీలో చేరి.. సాధారణ ఎమ్మెల్యేగా ఉండటంకంటే.. సొంతపార్టీ పొట్టుకుని, కాస్తో కూస్తో సీట్లు గెలుచుకుంటే.. తానే కీలక నేతగా ఉండొచ్చనేది ఆయన ఆలోచన అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఏమో.. గుర్రం ఎగరావచ్చు!

Related News

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Kakani Govardhan Reddy: జైలు జీవితం కాకాణిని మార్చేసిందా?

Big Stories

×