BigTV English

Elon Musk:- చైనాకు సాయంగా ఎలన్ మస్క్ సంస్థ..

Elon Musk:- చైనాకు సాయంగా ఎలన్ మస్క్ సంస్థ..

Elon Musk:-సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎక్కడ చూసినా ఇప్పుడు చైనా పేరే వినిపిస్తోంది. ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడి మరి చైనా.. టాప్ 1 స్థానానికి చేరుకుంది. అయినా కూడా చైనాకు తృప్తిగా లేదేమో ఇతర దేశాలు చేస్తున్న విభిన్న పరిశోధలనపై దృష్టి సారించింది. ఇటీవల స్పేస్ ఎక్స్.. ఆకాశంలోకి పంపిన స్టార్‌షిప్‌పై చైనా కన్నుపడింది. అలాంటి ప్రయోగాన్నే తాము కూడా చేయాలని నిర్ణయించుకుంది.


చైనా ఇప్పటికే ఈ ఏడాదిలో లో ఎర్త్ ఆర్బిట్‌లోకి శాటిలైట్లను పంపాలన్ని సన్నాహాలు చేస్తుంది. లియోలో శాటిలైట్లను పంపడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్న చైనా.. మరికొన్ని ప్రయోగాలు చేయడానికి కూడా సిద్ధమయ్యింది. ఈ ప్రయోగాల కోసం, చైనా లియోలోకి పంపించే శాటిలైట్ల కోసం స్టార్‌లింక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన స్టార్‌లింక్.. చైనా చేయనున్న పరిశోధనలనకు ఆర్థిక సాయం అందించనుంది.

ఎలన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ ద్వారానే స్టార్‌లింక్ ఆపరేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే స్టార్‌లింక్ 3500 శాటిలైట్లను లో ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి పంపింది. వీటిలో ఎక్కువగా అమెరికాలో తయారైనవే. ఇంకా ఎన్నో అమెరికన్ శాటిలైట్లను లియోలోకి పంపాలని స్టార్‌లింక్ సన్నాహాలు చేస్తోంది. మామూలుగా లియోకు పంపాలనుకునే శాటిలైట్లు ఇతర శాటిలైట్లతో పోలిస్తే కొంచెం తక్కువ ఖర్చుతో తయారుచేయబడతాయి.


చైనాకు చెందిన చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (కాసిక్).. తొలి లియో శాటిలైట్‌ను సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుంది. అయితే ఒకేసారి చాలా శాటిలైట్లను లాంచ్ చేయనున్నారా లేదా మెల్లగా ఒక్కొక్కటిగా లాంచ్ చేయనున్నారా అన్న విషయం ఇంకా తెలియలేదు. మామూలుగా లియోకు వెళ్లాల్సిన శాటిలైట్లు భూమికి 1000 కిలోమీటర్ల పైన ప్రయాణిస్తుంది. కానీ కాసిక్‌కు సంబంధించిన శాటిలైట్లు మాత్రం భూమికి కేవలం 150 నుండి 300 కిలోమీటర్లపైన మాత్రమే ప్రయాణిస్తాయని తెలుస్తోంది.

ఇప్పటికే అమెరికాకు సంబంధించిన పలు ఎగుమతి సంస్థలు.. చైనాను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాయి. అదే సమయంలో స్టార్‌లింక్ చైనాకు సాయంగా నిలబడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చైనా సాయం లేకుండా, చైనాకు సాయం చేయకుండా అమెరికా టెక్నాలజీల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రయత్నిస్తుండగా.. స్టార్‌లింక్ ఒప్పందం నిపుణుల్లో ఆందోళనల కలిగిస్తోంది. ఈ విషయంపై అమెరికా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×