BigTV English

India’s Remarkable 2023 : 2023లో భారత్ రికార్డుల మోత..!

India’s Remarkable 2023 : 2023లో భారత్ రికార్డుల మోత..!

India’s Remarkable 2023 :


  1. డిజిటల్ చెల్లింపుల జాబితాలో మనం ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచాము. 2023లో మన దేశంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి.2. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో తొలిస్థానంగానే గాక.. ప్రపంచపు అతిపెద్ద అయిదవ ఆర్థికవ్యవస్థగా భారత్ అవతరించింది.
  2. ప్రపంచపు అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ నౌక ‘ఎంవీ గంగా విలాస్’ను జనవరి 13న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది భారత్, బంగ్లాదేశ్‌లోని 27 నదుల గుండా 50 రోజులపాటు ప్రయాణించనుంది.
  3. 2023, జూన్ 21న సూరత్‌లో నిర్వహించిన యోగా సెషన్‌లో ఒకేసారి 1,47,952 మంది పాల్గొని యోగా చేశారు. అత్యధిక సంఖ్యలో పాల్గొన్న యోగా సెషన్‌గా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది.
  4. ఒకేసారి అత్యధిక దీపాలను వెలిగించిన కార్యక్రమంగా ‘అయోధ్య దీపోత్సవం’ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో ఏకంగా 22.23 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు.
  5. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం సూరత్ డైమండ్ బోర్స్‌ను ప్రారంభించారు. దీనిని 6,59,611 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు.
  6. జనాభా విషయంలో తొలిస్థానంలో(142.57 కోట్లు) ఉన్న చైనాను వెనక్కి నెట్టి మన దేశం ఆ స్థానానికి చేరకుంది. ప్రస్తుతం మన జనాభా 142.86 కోట్లు.
  7. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్‌వర్క్‌ భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది.
  8. భారత విమానయన సంస్థ (ఎయిర్ ఇండియా) ఒకేసారి 470 విమానాల కోసం ఆర్డర్ చేసింది. 250 ఎయిర్‌బస్‌, 220 అమెరికన్ జెయింట్ బోయింగ్‌‌లను రూ. 5.81 లక్షల కోట్లు వెచ్చించి కొనుగోలు చేయనుంది.
  9. వారణాసిలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం స్వర్వేద్ మహామందిర్‌ను ప్రారంభించారు. ఇందులో ఒకేసారి 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు.
  10. ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ మైలురాయిని చేరుకుంది.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×