BigTV English

New Medical Colleges: తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి

New Medical Colleges: తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో నాలుగు మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి

Telangana: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మరో నాలుగు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఏపీకి రెండు కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుమతి ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఈ మేరకు పర్మిషన్లు మంజూరు చేసింది. దీంతో తెలంగాణలో మెదక్, యాదాద్రి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ కాలేజీలకు అనుమతి లభించింది. ఒక్కో కాలేజీలో 50 సీట్లు కేటాయించింది. దీంతో కొత్తగా 200 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇదే ఏడాది తెలంగాణలోని నాలుగు మెడికల్ కాలేజీలు ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


8 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తుల నేపథ్యంలో జూన్ మాసంలో ఎన్ఎంసీ టీమ్ తెలంగాణ వచ్చి పరిశీలన చేసి వెళ్లింది. అయితే.. ఇక్కడ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు లేవని పేర్కొంటూ అనుమతి ఇవ్వలేదు. దీంతో టీచింగ్ స్టాఫ్, ఇతర సౌకర్యాల కోసం అవసరమైన నిధులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించింది. ఎన్ఎంసీ లేవనెత్తిన లోపాలను సవరించి ఫస్ట్ అప్పీల్‌కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెళ్లింది. దీంతో మరోసారి పరిశీలనలు చేసి ఎన్ఎంసీ ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చింది. అయితే, మిగిలిన నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వలేదు.

మిగిలిన నాలుగు కాలేజీలకు పర్మిషన్లు తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుదలతో పని చేసింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా రెగ్యులర్‌గా మానిటర్ చేశారు. స్టాఫ్ నియామకం, ఇతర సౌకర్యాల కల్పనపై ఫోకస్ పెట్టారు. అవసరమైన నిధులనూ కేటాయించారు. ఎన్ఎంసీ లేవనెత్తిన అభ్యంతరాలు, లోపాలను ఫుల్ ఫిల్ చేశారు. అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెకండ్ అప్పీల్‌కు వెళ్లింది కాంగ్రెస్ ప్రభుత్వం.


Also Read: Free Pilgrimage: వృద్ధులకు బంపర్ ఆఫర్.. పుణ్యక్షేత్రాలకు ఫ్రీగా ట్రైన్, ఫ్లైట్ సేవలు

ఈ అప్పీళ్లను పరిశీలించిన ఎన్ఎంసీ ఈ సారి మరో నాలుగు మెడికల్ కాలేజీలకు అనుమతలు ఇవ్వడానికి నిర్ణయించింది. దీంతో మెదక్, యాదాద్రి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయి. ఫలితంగా 200 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదే ఏడాది వచ్చిన నాలుగు మెడికల్ కాలేజీలనూ కలుపుకుని మొత్తం 400 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని మొత్తం సీట్ల సంఖ్య 4090కి పెరిగింది. కొత్తగా అనుమతులు పొందిన కాలేజీల్లో ఈ ఏడాది 2024-25 అకడమిక్ ఇయర్‌కు ఎంబీబీఎస్ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్ ఊపింది.

ఇక ఏపీ విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో కడప, పాడేరులోని ప్రభుత్వ కాలేజీలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది.

Related News

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన

Konda Surekha vs Ponguleti: ఢిల్లీకి చేరిన పంచాయితీ.. పొంగులేటిపై సోనియాకు కొండా కంప్లైంట్

BC Reservations: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. BC రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం

Karimnagar BJP: కరీంనగర్ జిల్లా బీజేపీలో.. బయటపడ్డ విభేదాలు..

Theft at Brilliant college: బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసులో వెలుగులోకి సంచలనాలు..

Padi Kaushik Reddy: అమ్మతోడు వెయ్యి మందితో దాడి చేస్తా.. సొంత పార్టీ నేతలకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Big Stories

×