Astrology 11 September 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి కలిసి వస్తుంది? వంటి విషయాలపై జ్యోతిష్యులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆశించిన లాభాలు వరిస్తాయి. కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. హనుమంతుడిని ఆరాధించాలి.
వృషభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల వారికి విజయసిద్ధి ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో చాకచక్యంగా వ్యవహరిస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఆర్థికాభివృద్ధి కోసం ప్రయత్నిస్తారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్, బదిలీలు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.
మిథునం:
మిథున రాశి వారికి మిశ్రమ కాలం. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు. ఉద్యోగులు పెండింగ్ పనులు పూర్తి చేస్వారు. తద్వారా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో హోదా పెరుగుతుంది. అనసవర ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.
కర్కాటకం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆశించిన విజయాలు చేకూరుతాయి. ఆటంకాలు తొలగి ఆర్థికంగా వృద్ది చెందుతారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా లేకపోతే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. సమయాన్ని వృథా చేయవద్దు. హనుమాన్ చాలీసా పారాయణ శుభకరం.
సింహం:
సింహ రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలహాలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సమయాన్ని వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తాయి. తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగుకుల శారీరక శ్రమ పెరుగుతుంది. ఆదిత్య హృదయం పారాయణ శ్రేయస్కరం.
కన్య:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక ప్రయోజనాలు వరిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. చిరాకు, ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. గణపతి ఆరాధన శుభప్రదం.
Also Read: అంగారకుడి సంచారం.. ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు.
తుల:
ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆందోళన చెందుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందికి గురిచేస్తాయి. హనుమాన్ చాలీసా చదవాలి.
వృశ్చికం:
వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో పెద్దల సహకారం అవసరం. వృత్తి, వ్యాపార రంగాలల్లో శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల నుంచి సపోర్టు ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.
ధనుస్సు:
ఈ రాశి వారికి అనుకూలంగా లేదు. ప్రారంభించిన పనుల్లో తోటివారి సహకారం తీసుకుంటారు. వృత్తి, వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఉద్యోగులు శుభవార్త వింటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆటంకాలు ఆందోళనలు కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. కోపం, చిరాకుతో దగ్గరవారిని దూరం చేసుకోకండి. శనిస్తోత్రం పారాయణ చేస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.
మకరం:
మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారులకు రెట్టింపు ఆదాయం వరిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. సమయానికి పనులు పూర్తి చేస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
కుంభం:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అన్ని రంగాల వారికి ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఉద్యోగులు రాణిస్తారు. తద్వారా ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. కోపం, చిరాకు, ఒత్తిడికి దూరంగా ఉండాలి. శ్రీలక్ష్మి గణపతి ధ్యానం శుభప్రదం.
మీనం:
మీన రాశి వారికి అనుకూలంగా లేదు. వృత్తి, వ్యాపా రంగాల వారికి నష్ట సూచన ఉంది. కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ ధైర్యంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. సమయానికి నిద్రపోవాలి. ఇతరులతో వాగ్వాదాలకు అవకాశం ఇవ్వకూడదు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవగ్రహ శ్లోకాలు పారాయణ చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.