BigTV English

Hyderabad Rains: నాన్‌స్టాప్ రెయిన్.. నాన్‌స్టాప్ ప్రాబ్లమ్స్.. అంతా ఆగమాగం

Hyderabad Rains: నాన్‌స్టాప్ రెయిన్.. నాన్‌స్టాప్ ప్రాబ్లమ్స్.. అంతా ఆగమాగం
Hyderabad rain news today

Hyderabad rain news today(Telangana news live): హైదరాబాద్‌ వాన నీటిలో నానుతోంది. రోజుల తరబడి నాన్‌స్టాప్ రెయిన్‌తో తడిసి ముద్దైతోంది. నాలాలు పొంగి, చెట్లు కూలి, వాహనాలు నిలిచి.. మహానగరం నరకం చూస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి గ్యాప్ లేకుండా వర్షం పడుతోంది. గురువారం సూర్యుడే బయటకు రాలేదు. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో జనం బెంబేలెత్తిపోతున్నారు.


హైదరాబాద్‌ నగరంలో మరో మూడు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణశాఖ. భారీ వర్ష సూచన నేపథ్యంలో నగర వాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు అధికారులు. భారీ వర్షాలతో ఇప్పటికే జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

వర్షంలో ఆఫీసులు, షాపులకు వెళ్లే వారు నానాఅవస్థలు పడుతున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించినా.. కొన్ని కాలేజీ యాజమాన్యాలు అడ్మిన్‌ స్టాఫ్‌కు మాత్రం సెలవులు ఇవ్వలేదు. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు ట్రాఫిక్‌ పోలీసులు. మూడు షిఫ్ట్‌లలో లాగౌట్‌ అవాలని సూచించారు.


నగరం నలువైపులా కుండపోత వర్షం పడింది. భారీ వర్షానికి రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ సమస్య నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. ఇప్పటికే పలు చోట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. నగరంలో నీళ్లు నిలిచిపోతున్న ప్రాంతాలను గురించిన ప్రత్యేక బృందాలు ఇబ్బందులను తొలగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. హెల్స్ లైన్ల కు వస్తున్న ఫోన్ కాల్స్ అధారంగా మాన్‌సూన్‌ సిబ్బంది పరుగులుతీస్తూ తక్షణమే అక్కడికి చేరుకుని సమస్య పరిష్కరిస్తున్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో.. ప్రజలు తప్పనిసరి అయితే తప్ప బయటకు రాకపోవడమే బెటర్.

హైదరాబాద్‌లో అత్యధికంగా బండ్లగూడ (చంద్రాయన్‌గుట్ట)లో 58 మిల్లీ మీటర్ల వర్షం పడింది. షేక్‌పేట్‌ 17 మి.మీ…
కాప్రా 57
లింగంపల్లి 56
గోల్కొండ 55
మల్కాజ్‌గిరి 53
ఉప్పల్ 51
కూకట్‌పల్లి 51
చార్మినార్ 50
అల్వాల్ 50
రాజేంద్రనగర్ 49
కుత్బుల్లాపూర్ 48
సికింద్రాబాద్ 47
అంబర్‌పేట్ 46
ఆసీఫ్‌నగర్ 45

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×