BigTV English

Parliament: ఇప్పటివరకు 27 అవిశ్వాస తీర్మానాలు.. ఏం జరిగిందంటే..?

Parliament: ఇప్పటివరకు 27 అవిశ్వాస తీర్మానాలు.. ఏం జరిగిందంటే..?
No Confidence Motion in India history

No Confidence Motion in India history(Current news from India): మోదీ సర్కారుపై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చాయి ప్రతిపక్షాలు. స్పీకర్ సైతం వాటిని తీసుకున్నారు. చర్చకు అన్నిపార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్పుడే కాదు.. ఇప్పటివరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ ముందుకు 27 అవిశ్వాస తీర్మానాలు వచ్చాయి. అవేంటంటే…


1962 యుద్ధంలో చైనా చేతిలో ఓడిపోయిన వెంటనే 63 ఆగస్టులో కాంగ్రెస్ నాయకుడు ఆచార్య కృపలానీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై తొలి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం వీగిపోయింది.

ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ అత్యధికంగా అవిశ్వాస తీర్మానాలను ఫేస్ చేశారు. ఆమె 15 బల నిరూపణ చేసుకోవాల్సి వచ్చింది. ప్రతిసారి నెగ్గారు. సీపీఎంకి చెందిన పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతిర్మయి బసు నాలుగు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టారు. పీవీ నరసింహారావు మూడు అవిశ్వాస తీర్మానాలు, మొరార్జీ దేశాయ్ రెండు, జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ ఒక్కో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు మోదీ రెండో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతున్నారు.


1979లో నాటి ప్రధానమంత్రిర మొరార్జీ దేశాయ్‌పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఆయన పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 1999లో వాజ్‌పేయికి ఏం జరిగిందో అందరికీ తెలుసు. అన్నాడీఎంకే మద్దతు ఉపసంహరించడంతో ఒక్క ఓటు తేడాతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది. ఆ రెండు సందర్భాల్లో తప్ప.. ప్రతి అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

2018లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంది. 195 ఓట్ల తేడాతో బయటపడింది. 135 మంది సభ్యులు తీర్మానానికి మద్దతు ఇవ్వగా, 330 మంది ఎంపీలు తిరస్కరించారు. ఇప్పుడు మోదీపై మరోసారి అవిశ్వాస తీర్మానం పెట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. లోక్‌సభలో గతంకంటే తమ బలం పెరిగిందని.. సులభంగా బయపడతామని అధికార పార్టీ సభ్యులు అంటున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×