E-Paper
Advertisement

MLA Naveen Yadav: నేను రివెంజ్ రాజకీయాలు చేయడానికి రాలేదు: నవీన్ యాదవ్

MLA Naveen Yadav: నేను రివెంజ్ రాజకీయాలు చేయడానికి రాలేదు: నవీన్ యాదవ్
Advertisement

MLA Naveen Yadav: స్వేఛ్చ బ్యూరో: నియోజకవర్గ కేంద్రంలో మున్సిపల్ ఉప ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. ప్రచార పర్వం తుది అంకానికి చేరుకోవడంతో ప్రధాన పార్టీల మధ్య పోటీ పోటాపోటీగా సాగుతోంది. ఈ క్రమంలో 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బద్దుల లావణ్య ఉపేందర్ విజయమే లక్ష్యంగా పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ నవీన్ యాదవ్(Naveen Yadav) ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శనివారం వార్డులోని ప్రతి గల్లీలోనూ పర్యటించిన ఆయనకు స్థానిక ప్రజలు, ముఖ్యంగా మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకుంటున్న నవీన్ యాదవ్, హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు.

కుండబద్దలు

Advertisement

ప్రచారంలో భాగంగా తనపై ప్రత్యర్థులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. “నేను రివెంజ్ రాజకీయాలు చేయడానికి రాలేదు.. నియోజకవర్గ అభివృద్ధిని పట్టాలెక్కించడానికి వచ్చాను” అని నవీన్ యాదవ్ కుండబద్దలు కొట్టారు. గత పదేళ్ల కాలంలో హుజురాబాద్ పాలన కేవలం ఆడంబరాలకే పరిమితమైందని, గల్లీల్లోని సామాన్యుడి గోడును పట్టించుకున్న నాథుడే లేడని ధ్వజమెత్తారు. ఓట్లు వేయించుకుని పదవులు అనుభవించిన నాయకులు ఏనాడూ బడుగు, బలహీన వర్గాల కాలనీల్లో పర్యటించలేదని, ఇప్పుడు ఎన్నికలు రాగానే మళ్లీ ప్రజలను మభ్యపెట్టేందుకు వస్తున్నారని విమర్శించారు. గల్లీల్లో పేరుకుపోయిన మురుగు నీరు, అధ్వాన్నంగా మారిన రహదారులు, అసంపూర్తిగా మిగిలిన ఇందిరమ్మ ఇళ్లు గత పాలకుల వైఫల్యాలకు సజీవ సాక్ష్యాలని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో రాష్ట్రంలో ‘ప్రజా పాలన’ కొనసాగుతోందని, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరుతున్నాయని నవీన్ యాదవ్ వివరించారు.

Also Read: Eesha Rebba : పింక్ డ్రెస్ లో ఈషా పరవాల విందు.. ఎంత క్యూట్ గా ఉందో..

Advertisement

హుస్నాబాద్ నియోజకవర్గం

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిందని, అందుకే జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ వంటి చోట్ల ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారని గుర్తు చేశారు. రాబోయే మూడేళ్ల కాలం హుజురాబాద్ అభివృద్ధికి అత్యంత కీలకమని, స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే మంత్రుల సహకారంతో నిధులు రాబట్టడం సులువవుతుందని చెప్పారు. ముఖ్యంగా మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabakar), తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nagesjwar Rao) సమన్వయంతో హుజురాబాద్ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులే తమ చిత్తశుద్ధికి నిదర్శనమని, అదే తరహా అభివృద్ధి ఇక్కడ కూడా జరగాలంటే హస్తం గుర్తుపై ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 4వ వార్డు అభ్యర్థి లావణ్యను భారీ మెజారిటీతో గెలిపించి, వార్డు ప్రగతికి సహకరించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Also Read: BRS : గులాబీ పార్టీలో కట్టప్పలు!

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×