E-Paper
Advertisement

NPDCL Polambata: రాష్ట్రంలో సత్ఫలితాలనిస్తున్న పొలం బాట కార్యక్రమం

NPDCL Polambata: రాష్ట్రంలో సత్ఫలితాలనిస్తున్న పొలం బాట కార్యక్రమం
Advertisement

NPDCL Polambata: కరెంటోళ్ల పొలంబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. గతంలో విద్యుత్ సమస్యలు వస్తే కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి నేరుగా విద్యుత్ అధికారులే పొలం బాట కార్యక్రమం చేపట్టడంతో సమస్యలు సత్వరగా పరిష్కారమవుతున్నాయి. తెలంగాణ స్టేట్ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) పరిధిలో చేపట్టిన పొలంబాటకు విస్తృతమైన ఆదరణ లభిస్తోంది. విద్యుత్ వినియోగదారులందరికీ మరింత చేరువై వారికి వినూత్న సేవలు అందిస్తున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ అధికారుల పోలం బాట ద్వారా 7,840 కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ప్రజాబాట కార్యక్రమాలు 938 చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో పలు సమస్యలు గుర్తించారు. 4540 స్తంభాలు వంగిపోయి ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించారు. అలాగే లూజ్ లైన్లు 22,224 ఉన్నాయని, మధ్యలో 19,245 స్తంభాల అవసరముందని గుర్తించడమే గాక ఆ పనులను పరిష్కరించినట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.

సమస్యలను త్వరగా గుర్తించి..

పొడవైన విద్యుత్ లైన్లలో(25 కిలోమీటర్ల కంటే ఎక్కువ) విద్యుత్ సమస్యలను త్వరగా గుర్తించి పరిష్కరించడానికి, 33 కేవీ ఫీడర్లలో 775 ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్లు, 11 కేవీ ఫీడర్లలో 15,352 ఫాల్ట్ పాసేజ్ ఇండికేటర్లు ఇన్ స్టాల్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా 33 కేవీ 671 ఫీడర్లలో 14,544 కిలో మీటర్ల మేర లైన్లను జీఐఎస్ మ్యాపింగ్ పూర్తిచేసినట్లు తెలిసింది. అలాగే 11 కేవీ 4,471 ఫీడర్లలో 40,572 కిలో మీటర్ల మేర జీఐఎస్ మ్యాపింగ్ పూర్తయింది. అంతేకాకుండా అధునాతన టెక్నాలజీ అయిన రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ వ్యవస్థను దాదాపు 400 సబ్ స్టేషన్లలో ఏర్పాటుచేసినట్లు చెబుతున్నారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించడానికి 178 33/11 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్లను ఏర్పాటు చేశారు. దాదాపు 777 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి.

Advertisement

Also Read: Bomb threat: టెన్ష‌న్.. టెన్ష‌న్.. బేగంపేట వెదర్ ఆఫీస్ కి బాంబు బెదిరింపు

జీపీఆర్ఎస్ సైతం వాహనాలకు ఫిక్స్..

భారీ వర్షాలు, ఈదురు గాలులకు, సాంకేతికంగా విద్యుత్ సమస్యల వల్ల ఏర్పడే అంతరాయాలను తగ్గించడానికి ఎన్పీడీసీఎల్ పరిధిలో 54 ఎమర్జెన్సీ రీస్టోర్ టీం వాహనాలను వినియోగిస్తున్నారు. ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో 144 వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో మరమ్మతుకు వినియోగించాల్సిన టూల్ కిట్ మెటీరియల్ ఉంటుంది. జీపీఆర్ఎస్ సైతం వాహనాలకు ఫిక్స్ చేయడంతో సత్వరగా వెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు ఎమర్జెన్సీ రీస్టోర్ టీం వాహనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జీరో విద్యుత్ ప్రమాదాల లక్షంగా సర్కిల్ లోని డీఈ టెక్నికల్ అధికారులను సేఫ్టీ అధికారులుగా ఎన్పీడీసీఎల్ నియమించింది. వారు వినియోగదారులకు విద్యుత్ ప్రమాదాల నివారణకు విస్తృత ప్రచారం కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. రైతులు, వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లో సొంతంగా విద్యుత్ పనుల మరమ్మతులు చేయకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఇతర సమస్యలకు టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా సంప్రదించాలని సూచించారు.

నేడు చార్జీల ప్రతిపాదనలపై బహిరంగ విచారణ

Advertisement

విద్యుత్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్-సబ్సిడీ-సర్ చార్జీల ప్రతిపాదనలపై శుక్రవారం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ చేపట్టనున్నట్లు నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సవరించిన ప్రతిపాదనలపై శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి హన్మకొండ కలెక్టరేట్ లో బహిరంగ విచారణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విచారణలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, మెంబర్ ఫైనాన్స్ చెరుకూరి శ్రీనివాసరావు, రఘు కంచెర్ల మెంబర్ టెక్నికల్ పాల్గొంటారన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ బహిరంగ విచారణకు హాజరవ్వాలని కోరారు.

Alsdo Read: Karnataka: కర్ణాటక బడ్జెట్ సంచలనం.. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ‘నో ఎంట్రీ’!

Related News

వరంగల్ ఎయిర్‌పోర్టు గురించి శుభవార్త.. నిధులపై మంత్రి ప్రకటన, టెండర్లు ఆహ్వానంతో

హైదరాబాద్ సిటీలో వాహనదారులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, ఆయా ప్రాంతాల్లో

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

Big Stories

Advertisement
×