Weather News: రెండు తెలుగు రాష్ట్రాల్లో జులై 17 నుంచి జులై 26 మధ్య పది రోజులు వర్షాలు దంచికొట్టాయి. కుండపోత వానలు కురిశాయి. రుతపవనాలు చురుగ్గా కదలడం.. బంగాళఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన పరిస్థితుల వల్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరం చిత్తడిచిత్తడై పోయింది. రోడ్లపైకి భారీ వరద నీరు చేరుతుండడంతో భాగ్యనగర వాసులు నానా ఇబ్బందులు పడ్డారు. ఓవైపు భారీ వర్షాలు, మరో వైపు ట్రాఫిక్ సమస్యలతో వాహనదారుల అష్టకష్టాలు చూశారు. అయితే గత ఐదు రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలు పడడం లేదు. ఇదే వాతావరణం మరికొన్ని రోజులు కొనసాగనుందని అధికారులు చెబుతున్నారు. తాజాగా ఆగస్టు నెలలో వాతావరణ పరిస్థితులపై అధికారులు అంచనా వేశారు.
ఆగస్ట్ రెండో వారంలో భారీ వర్షాలు..
ఆగస్టు రెండవ వారంలో హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఉండవచ్చని చెప్పారు. ఆగస్ట్ నెలలో సాధారణం కంటే ఎక్కువగానే.. వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 2,3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణలో 8 శాతం లోటు వర్షపాతం ఉందని వివరించారు. కొన్ని రోజుల వరకు మళ్లీ పొడి వాతావరణమే ఉంటుందని వివరించారు. నారాయణపేట, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, ములుగు జిల్లాల్లో ఇప్పటికే అత్యధిక వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు చెప్పారు. నిర్మల్, మేడ్చల్ జిల్లాలో లోటు వర్షాపాతం నమోదు అయ్యిందని అన్నారు.
రాబోయే ఐదు రోజుల్లో ఇది పరిస్థితి..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏవీ లేకపోవడం వల్ల రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి వర్షసూచన లేదని తెలిపారు. అయితే ఎండ తీవ్రత పెరిగినప్పుడు.. క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం వేళ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. రాబోయే నాలుగు, ఐదు రోజులు అన్ని జిల్లాలకు ఈదురుగాలుల ప్రభావం ఉందని చెప్పారు. 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఆగస్ట్ 7 నుంచి 15 మధ్య దక్షణ, పశ్చిమ, మధ్య తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఆగస్ట్ 15 నుంచి 23 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని చెప్పారు. ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 1 వరకు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
ALSO READ: University of Hyderabad: గ్రేట్.. రూ.46లక్షల జీతంతో ఉద్యోగం.. ఇంకా 550 మందికి జాబ్స్..
ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 6: రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది.. ఈదురు గాలుల ప్రభావం ఉండనుంది.
ఆగస్ట్ 7 నుంచి ఆగస్ట్ 15: దక్షణ, పశ్చిమ, మధ్య తెలంగాణలో భారీ వర్షాలు పడే ఛాన్స్..
ఆగస్ట్ 15 నుంచి ఆగస్ట్ 23: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం..
ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 1: మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు
నోట్: జులై నెలలో కంటే ఆగస్ట్ నెలలో ఎక్కువగా వర్షాలు పడే ఛాన్స ఉందని అధికారులు చెబుతున్నారు..
ALSO READ: Jobs in CCRAS: టెన్త్, ఇంటర్ పాసైతే ఉద్యోగం మీదే బ్రో.. జీతమైతే అక్షరాల రూ.39,100