Lionel Messi : భారత ఫుట్ బాల్ లవర్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ప్రముఖ దిగ్గజ ఫుట్ బాలర్, అర్జెంటినా కెప్టెన్ లియోనల్ మెస్సి త్వరలో భారత్ పర్యటనకు రానున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి 15 వరకు అతను కోల్ కతా, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు మెస్సీ. మరోవైపు మెస్సీ కి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగనుంది.
Also Read : Woakes : ఇంగ్లాండ్ కు బిగ్ షాక్… మ్యాచ్ మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయిన డేంజర్ ఆటగాడు !
మెస్సీ రాక.. టీమిండియాకి కప్
కోల్ కతా పర్యటనలో మెస్సీ చిన్న పిల్లల కోసం ఫుట్ బాల్ వర్క్ షాపు నిర్వహిస్తాడు. ఇదే సందర్భంగా మెస్సీ చేతుల మీదుగా ఫుట్ బాల్ క్లినిక్ లాంచ్ కూడా కానుంది. మెస్సి పలువురు భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి క్రికెట్ మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఉంది. కోల్ కతా పర్యటన అనంతరం మెస్సీ డిసెంబర్ 14న ముంబై లో పర్యటిస్తాడు. ఈ పర్యటనలో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొంటాడు. దీనికి ముందు భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎం.ఎస్.ధోనీ లతో కలిసి సెవెన్-ఏ సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ముంబై పర్యటన తరువాత మెస్సీ ఢిల్లీలో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. మెస్సీ భారత పర్యటకు సంబంధించిన షెడ్యూల్ మాత్రం అధికారికంగా అయితే ఖరారు కాలేదు. కానీ షెడ్యూల్ ఫైనల్ అయ్యాక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక మెస్సి గతంలో తొలిసారి 2011లో భారత్ లో పర్యటించారు. 2011లోనే భారత్ కి వరల్డ్ కప్ ధోనీ కెప్టెన్సీ రావడం విశేషం.
మెస్సీ భారత్ రావడం రెండోసారి
గత 14 ఏళ్లలో మెస్సీ భారత్ కి రావడం ఇది రెండో సారి అవుతుంది. చివరి సారిగా 2011లో అర్జెంటీనా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను నెగ్గాక కోల్ కతా వేదికగా జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్నాడు మెస్సీ. డిసెంబర్ 14న మెస్సీ ముంబైకి రానున్నాడని.. వాంఖడే స్టేడియంలో ఆరోజు దిగ్గజ క్రికెటర్లతో మ్యాచ్ ఆడుతాడని.. ఆ రోజు గ్రౌండ్ ను బ్లాక్ చేయాలని ఇప్పటికే ఎంసీఏను ఓ ఏజెన్సీ కోరింది. ఇటీవల జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమోదించిందని ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి. ఈడెన్ గార్డెన్ లో అతని గౌరవార్థం Goat cup మ్యాచ్ నిర్వహిస్తారని సమాచారం. మరోవైపు అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టు వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ లో కేరళకు వస్తుందని ఆ రాష్ట్ర మంత్రి అబ్దుల్ రహిమాన్ జూన్ 06న వెల్లడించడం విశేషం. గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతారని పేర్కొన్నారు. అందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతుగా నిలిచింది. ఇప్పుడు మెస్సీ డిసెంబర్ లో భారత్ కి వస్తాడని షెడ్యూల్ తుదిదశలో ఉండటంతో.. అక్టోబర్ లో వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తోంది.