E-Paper
Advertisement

RangaReddy : తాగుడుకు బానిసైన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి..

RangaReddy : తాగుడుకు బానిసైన మహిళ.. అనుమానాస్పద స్థితిలో మృతి..
Advertisement

RangaReddy : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో జరిగింది. స్థానిక సీఐ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. జి సుగుణ అనే మహిళ కొడుకుతో కలిసి కేశంపేట రోడ్డులో గల ఇంట్లో జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో తాగుడుకు బానిస అయింది. కొడుకుతో గొడవపడి మరీ డబ్బులు తీసుకుని మద్యం సేవిస్తుండేది.

ఈ క్రమంలో 20 రూపాయల కోసం కొడుకుతో గొడవపడింది. అతను చేయి చేసుకోవడంతో ఆమె కింద పడిపోయింది. స్థానికులు వారి మధ్య గొడవను ఆపారు. కూతురు కూడా వచ్చి మందలించి వెళ్లిపోయింది. ఆమె మరుసటి రోజు కూడా అదే విధంగా తాగి వచ్చి ఇంటిముందు కింద పడిపోగా స్థానికులు ఆమెను ఇంట్లో పడుకోబెట్టారు. కొడుకు తల్లిని నిద్రలేపడానికి ప్రయత్నించగా తను స్పందించకపోవడంతో స్థానికుల సహకారంతో చూడగా ఆమె అప్పటికే చనిపోయిందని గుర్తించారు. మహిళ మరణానికి గల కారణాలను పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×