BigTV English

Kesineni Nani: అయోమయంలో కేశినేని నాని రాజకీయ భవిష్యత్.. మాకొద్దంటే మాకొద్దంటున్న పార్టీలు..

Kesineni Nani: అయోమయంలో కేశినేని నాని రాజకీయ భవిష్యత్.. మాకొద్దంటే మాకొద్దంటున్న పార్టీలు..

Kesineni Nani: ఎంపీ కేశినేని నాని రాజకీయ భవిష్యత్‌ అయోమయంలో పడింది. ఎటువెళ్లాలో తెలియక గందరగోళంలో పడ్డారు. కనీసం ఏ పార్టీ నుంచి కూడా పిలుపు రాకపోవడంతో పొలిటికల్‌ లైఫ్‌ అగమ్యగోచరంగా మారింది. టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేశినేని.. ఇంతవరకు తదుపరి కార్యాచరణపై క్లారిటీ ఇవ్వలేదు. ఆయన కుమార్తె కార్పొరేటర్‌ శ్వేత మాత్రం రిజైన్‌ చేసేశారు.


కేశినేని రాజీనామా నిర్ణయం తర్వాత.. ఏ రాజకీయ పార్టీలు కూడా సంప్రదింపులు జరపలేదు. బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా.. వాళ్లు పట్టించుకోవడం లేదు. బీజేపీలో చేరేందుకు ఢిల్లీ స్థాయిలో ఎంపీ లాబియింగ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు కూడా ఇప్పటివరకూ స్పందించలేదు. వైసీపీ ఎన్టీఆర్‌ జిల్లా నేతలు మాత్రం కేశినేని వైసీపీలోకి ఎంటర్‌కాకూడదనే కోరుకుంటున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి వైసీపీలోకి రావాలని వైసీపీ పెద్దలు అంటున్నారు. నిన్న కొడాలి నాని కూడా ఎంపీ నానీపై ప్రేమ కంటే బాబుపై కోపాన్ని చూపించారు. అటు పార్లమెంట్‌ పరిధిలో ఉన్న అనుచరులు కూడా కేశినేనికి హ్యాండ్‌ ఇచ్చారు. టీడీపీ ఏ ముఖ్యమంటూ పార్టీ నుంచి బయటకు రావడం లేదు. ఇకే చేసేదేం లేక నాని బిత్తరపోతున్నారు. ఏమైనా ఆ బెజవాడ దుర్గమ్మే దారి చూపించాలంటూ కేశినేని నాని వేడుకుంటున్నారు.

కష్టకాలంలో టీడీపీకి అండగా ఉన్న కేశినేని నానిని చంద్రబాబు మోసం చేశాడని కొడాలి నాని ఆరోపించారు. విజయవాడ టికెట్‌ను కేశినేని చిన్నికి 100కోట్లకు అమ్ముకున్నారంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో జరుగుతున్న పరిణామాలు, కొడాలి నాని కామెంట్లు.. విజయవాడ పాలిటిక్స్‌ను మరింత హీట్‌ పెంచేలా చేస్తున్నాయి.


.

.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×