One Nation-One Student ID: తెలంగాణ వ్యాప్తంగా ‘వన్ నేషన్-వన్ స్టూడెంట్’ ఐడీ పద్దతి ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ఈసారి ఇంటర్ విద్యార్థులకు అమలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు జూనియర్ కాలేజీలకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇంతకీ కేంద్రం తీసుకొచ్చిన ఐటీ విధానం ఏంటి? అన్నదే అసలు ప్రశ్న.
దేశంలో ప్రతీ ఏడాది లక్షల్లో ఫేస్ సర్టిఫికెట్లు పుట్టుకొస్తున్నాయి. వీటిని అడ్డుకట్ట వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆగడం లేదు. కింది స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు నకిలీ సరిఫికెట్లు ఇబ్బందిముబ్బడిగా పెరుగుతున్నాయి. వీటికి ఇకపై అడ్డుకట్ట పడనుంది.
కేంద్రం తీసుకొచ్చిన జాతీయ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ప్రకారం.. వన్ నేషన్-వన్ స్టూడెంట్ ఐడీ పద్దతిని దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పుటికే పలు రాష్ట్రాలు ఈ పద్దతిని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. దీనివల్ల ప్రతీ విద్యార్థికి పర్సనల్ ఎడ్యుకేషన్ నెంబరు ఉంటుంది.
ఇప్పటికే పాఠశాల విద్యార్థులకు ఐడీ పద్దతిని అమలు చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వర్తింప చేయనుంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఇంటర్ విద్యాశాఖను ఆదేశించారు. ఇందులోభాగంగా ఐడీ నెంబరు విద్యార్థుల పూర్తి వివరాల పత్రం, హాల్ టికెట్లు, మార్కుల మెమోలపై ఆయా నెంబరు ముద్రించనున్నారు.
ALSO READ: స్థానిక ఎన్నికల భయంలో బీఆర్ఎస్.. ఎందుకంటే?
విద్యార్థుల చదువు పూర్తి అయ్యేవరకు వారిని పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఇకపై ఏకీకృత జిల్లా విద్యా వ్యవస్థ సమాచారం-UDISE 2025-26లో తప్పనిసరిగా ఒకటి నుంచి ఇంటర్ వరకు విద్యార్థుల వివరాలను నమోదు అవుతాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల వివరాలు పూర్తిగా నమోదు కాలేదు.
దాదాపు లక్ష మంది UDISEలో చేరలేదు. ఈ విషయాన్ని సమగ్ర శిక్షా ప్రాజెక్టు విభాగం వెల్లడించింది. తాజాగా ఈ ఏడాది నుంచి ప్రతి ఇంటర్ విద్య వివరాలను UDISEలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. జాతీయ విద్యా విధానం-2020 ప్రకారం అన్ని కళాశాల/విశ్వవిద్యాలయ విద్యార్థులు అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్-ABCలో నమోదు చేసుకోవాలి.
కళాశాల లేదా విశ్వవిద్యాలయ ప్రవేశానికి ఈ ID తప్పనిసరి కానుంది. దీన్ని ఆధార్‌తో లింకు చేస్తున్నారు. ఆ విద్యార్థి ఎక్కడెక్కడ చదివాడు? చిన్నప్పటి నుంచి స్టడీ ఎలా ఉండేది? ఒకవేళ అనుమానం వచ్చి UDISEలో ఒక్క క్లిక్ చేస్తే చాలు ఆ విద్యార్థికి సంబంధించి ఎడ్యుకేషన్ వివరాలు మొత్తమంతా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఫేక్ సర్టిఫికెట్లకు ఆస్కారం ఉండదు.