Illu Illalu Pillalu Today Episode july 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంటి పెత్తనం చేతికి వచ్చిందని శ్రీవల్లి తన పుట్టింటికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది. బుల్లెట్ బండి పై హీరోయిన్ లాగా తన పుట్టింటికి వెళ్తుంది. వల్లిని చూసి వాళ్ళ అమ్మ నాన్న షాక్ అవుతారు. ఇంటి తాళాలు నా చేతికి వచ్చాయి ఇది చెప్పడానికి వచ్చాను అని అంటుంది. ఆ తర్వాత నువ్వు నా కూతురు అనిపించుకున్నవే అని భాగ్యం మెచ్చుకుంటుంది.. ఆ ఇంట్లోనే ఇద్దరికి కోడల్ని బయటికి పంపించేసి ఆస్తి మొత్తాన్ని నీ చేతికి దక్కేలా చేసుకో అని భాగ్యం సలహా ఇస్తుందే.
నువ్వే ఏం చెప్తే అదే చేస్తాను అమ్మా అని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత ప్రేమ అన్నారు కదా ఇద్దరూ మావయ్య ఇలా చేస్తారని అసలు ఊహించలేదు అక్క అని మాట్లాడుకుంటూ ఉంటారు.. శ్రీవల్లి ప్రేమ ఇద్దరూ మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వస్తుంటారు. దొంగకు పెత్తనం ఇచ్చినట్టు మావయ్య గారు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని మాట్లాడతారు. ఇదంతా పక్కన పెడితే మీరు సంతోషంగా ఉన్నారా అని నర్మదా అడుగుతుంది. అప్పుడే ధీరజ్ డెలివరీ కోసం అటుగా వెళ్తాడు. ప్రేమ అరుస్తున్న కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. నర్మదా ధీరజ్ నీపై ఇంకా కోపంగా ఉన్నాడా అని అడుగుతుంది.. అదేమీ లేదక్కా ఏదో డెలివరీ కోసం అర్జెంటుగా వెళుతున్నాడని అర్థం అవుతుంది అని కవర్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ నిద్రపోవటం చూసి ఎలాగైనా రీవైంజ్ తీర్చుకోవాలని అనుకుంటుకుంది. నీళ్లు కొట్టి లేపుతుంది. ఏంటక్కా బుద్ధి లేకుండా నిద్రపోతున్న దానిమీద నీళ్లు కొట్టావని ప్రేమ అరుస్తుంది. రెస్ట్ తీసుకోడానికి ఇది ఏమైనా నీ పుట్టిల్లు కాదు కదా.. నిద్రపోతే ఇంట్లో పని ఎవరు చేస్తారు అని ప్రేమ ఉంటుంది.. ఇంట్లో పని ఏంటి అయినా నాకు పొద్దునే లేచి పని చేసే అలవాటు లేదు ఇక మీద లేవను కూడా అని ప్రేమ ఉంటుంది. పొద్దున్నే ఐదు గంటలకు లేచి ఇంటి పని చేయాల్సిందే అని శ్రీవల్లి అంటుంది.. ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరు అని ప్రేమ అంటుంది. మావయ్య గారు నా చేతికి పెత్తనం ఇచ్చారు కదా.. అందర్నీ దారిలో పెట్టాలి అని శ్రీవల్లి అంటుంది. శ్రీవల్లి ప్రేమల మధ్య మాటలు యుద్ధం మొదలవుతుంది.
నువ్వేం చేస్తావో చేసుకో నేనైతే చేయను అని ప్రేమ కచ్చితంగా చెప్పేస్తుంది. కానీ శ్రీవల్లి మాత్రం ఇదే విషయాన్ని మావయ్య గారికి చెప్పు అని అంటుంది. ఇక చేసేదేమీ లేక ప్రేమ ముగ్గు వేయ్యడానికి బయటకు వెళ్తుంది. ఈవిడ గారినైతే లైన్లో పెట్టంగానే ఆ పోట్ల గిత్తని ఎలా లైన్లో పెట్టాలో అర్థం కావట్లేదని నర్మద దగ్గరికి శ్రీవల్లి వెళ్తుంది.. స్నానం చేసేందుకు నర్మదా వేడి నీళ్లు ఆన్ చేసుకొని పెట్టుకుంటుంది. నీళ్లు చల్లగా రావడం చూసి బయటకు వస్తుంది. నేను ఆన్ చేశాను కదా ఇక్కడ ఎవరు గ్రీజర్ ఆఫ్ చేశారు అని అక్కడికొచ్చి చెక్ చేస్తుంది.
అక్కడే ఉన్న శ్రీవల్లి నేనే గ్రీజర్ ఆఫ్ చేశాను కంట్రోల్లో పెట్టాలని అంటుంది.. ఏం కంట్రోల్లో పెట్టాలి బల్లక్క అని నర్మదా అడుగుతుంది.. మావయ్య గారు చెప్పారు కదా కరెంట్ బిల్లు కంట్రోల్లో పెడదామని అత్తయ్య మామయ్య తప్ప మిగతా వాళ్ళందరూ చన్నీటి స్నానం చేయాలని చెప్తుంది.. చిన్నప్పటి నుంచి నేను వేడి నీళ్లతోనే స్నానం చేశాను. నాకు వేడి నీళ్లు లేకపోతే స్నానం చేయలేను అని నర్మదా అన్న కూడా శ్రీవల్లి మాత్రం మావయ్య గారికి ఇదే మాట చెప్పు అని అంటుంది.. ఇక చేసేదేమీ లేక నర్మదా చల్లనీల్లతో స్నానం చేసేందుకు వెళుతుంది.
ఇకపోతే అందరూ స్నానం చేసి వచ్చిన తర్వాత శ్రీవల్లి పూజ చేసేందుకు పూజగదికి అందర్నీ రమ్మంటుంది.. అత్తయ్య గారండీ మావయ్య గారు మీకు పూజ చేసే అవకాశం కూడా లేకుండా చేశారు నాకు చాలా బాధగా ఉందండి అని అంటుంది. మరేం పర్లేదమ్మా నువ్వు పూజ చెయ్యు అని అంటుంది వేదవతి.. శ్రీవల్లి పూజ చేసి అందరికీ హారతిస్తుంది. అయితే రామరాజు మిల్లు కి టైం అవుతుందమ్మా తాళాలు తీసుకురా అని పిలుస్తుంటే మావయ్యగారండి హారతి తీసుకుని అని అంటుంది.
Also Read: అవని, అక్షయ్ సేఫ్.. కమల్ ఫుల్ హ్యాపీ.. ప్రణతికి పల్లవి షాకివ్వబోతుందా..?
ఇక అందరూ రెడీ అయ్యి వెళ్తుంటే మాయగారండి మీరు ఒక నిమిషం ఆగితే నేను కొన్ని విషయాలు చెప్పాలండి మీ ముందర అని అంటుంది. సరే చెప్పమ్మా ఏంటో అని రామరాజు అంటాడు.. వేదవతి కూడా మౌనంగా ఉండిపోతుంది. శ్రీవల్లి ఇంట్లోని వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ రూల్స్ పాటించాలి అప్పుడే ఎవరి దగ్గర మాట పడాల్సిన అవసరం లేదు అని కండిషన్స్ పెడుతుంది. అయితే ఆ కండిషన్స్ విన్న అందరూ షాక్ అవుతారు. రామరాజు కూడా మౌనంగా ఉండడంతో శ్రీవల్లి రెచ్చిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..